Yo Yo Honey Singh: బాలీవుడ్ పాప్ సింగర్ హనీ సింగ్‌కు నోటీసులు.. భార్య ఫిర్యాదుపై..
Court notice to Honey Singh: బాలీవుడ్ ఫేమస్ పాప్ సింగర్-యాక్టర్ యో యో హనీ సింగ్‌పై అతని భార్య శాలిని తల్వార్ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విచారించిన
Court notice to Honey Singh: బాలీవుడ్ ఫేమస్ పాప్ సింగర్-యాక్టర్ యో యో హనీ సింగ్‌పై అతని భార్య శాలిని తల్వార్ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై విచారించిన ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టు బుధవారం యో యో హనీ సింగ్ (హిర్దేశ్ సింగ్)కు ఢిల్లీ కోర్టు నోటీసు జారీ చేసింది. తన భార్య షాలిని తల్వార్ దాఖలు చేసిన తాజా పిటిషన్ పై కూడా వాదనలు వినిపించాలని.. ఈ మేరకు హనీసింగ్ కెమెరాలో రికార్డు రూపంలో కోర్టుకు సమర్పించవచ్చని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్.. హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్‌ను తన చాంబర్‌కు పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 28కి వేశారు. కాగా.. శాలిని తల్వార్.. హనీసింగ్‌పై ‘గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద కేసు దాఖలు చేసింది. దీంతోపాటు దుబాయ్ లోని ఆస్థులకు సంబంధించన వాటపై కూడా ఆమె పిటిషన్ లో పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకు ఆస్థులపై నిర్ణయం లేకుండా చూడాలంటూ తల్వార్ కోర్టును కోరింది.
అయితే.. అంతకుముందు ఆగస్టు 28న ఈ కేసుపై విచారణ జరిగింది. హనీ సింగ్ కోర్టుకు హాజరు కాకపోవడంపై ధర్మాసనం మందలించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఆదాయ అఫిడవిట్ దాఖలు చేయలేదని.. వాదనలకు కూడా సిద్ధంగా లేరంటూ ఆయన హనీ సింగ్ తరపు న్యాయవాదిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే చివరిసారని.. హనీ సింగ్ తదుపరి విచారణకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు.
కాగా.. హనీ సింగ్ భార్య షాలిని తల్వార్..పలు ఆరోపణలు చేసింది. గత పదేళ్లు తనను ఇంట్లో దారుణంగా ఉంచాడని పేర్కొంది. తనను శారీరకంగా, మాటలతో, మానసికంగా హింసించారని, తన వివాహానికి ప్రాముఖ్యత ఇవ్వలేదని, ఉంగరాన్ని సైతం ధరించలేదని తెలిపింది. హనీ సింగ్, షాలిని తల్వార్ 2011 జనవరి 23న వివాహం చేసుకున్నారు.
Also Read: