Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..

Tollywood Heroine Pics: హీరోలు, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇండస్ట్రీ ఏదైనా..

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 15, 2021 | 8:33 PM

హీరోలు, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇండస్ట్రీ ఏదైనా కూడా తమకు నచ్చిన సినీ సెలబ్రిటీలు చైల్డ్‌హుడ్ ఫోటోలు షేర్ చేస్తే చాలు.. ఫ్యాన్స్ వాటిని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. కుర్రకారు కలల రాణి. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో సినిమాలు కూడా చేసింది. ఈపాటికి గుర్తుపట్టే ఉంటారు.! ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి కియారా అద్వానీ.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

2014లో ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కియారా.. ఆ తర్వాత చేసిన ‘ఎం.ఎస్.ధోని’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించి.. సౌత్‌లో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. కాగా, కియారా అద్వానీ ప్రస్తుతం హిందీలో భూల్ భులయ్యా 2, జగ్ జుగ్గ్ జీయో, మిస్టర్ లెలే అనే చిత్రాల్లో నటిస్తుండగా.. తెలుగులో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చేస్తోంది. అలాగే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో నటించనుందని తెలుస్తోంది.