Mission: Impossible 7: హాలీవుడ్ ను వదలని కరోనా.. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రయూనిట్ లో కరోనా కలకలం..
కరోనా సెకండ్ వేవ్.. హాలీవుడ్‌ను కూడా భారీగా ఎఫెక్ట్ చేసింది. కొన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా... అక్కడక్కడా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి.
Mission: Impossible 7: కరోనా సెకండ్ వేవ్.. హాలీవుడ్‌ను కూడా భారీగా ఎఫెక్ట్ చేసింది. కొన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా… అక్కడక్కడా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్‌లకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. రీసెంట్‌గా మిషన్ ఇంపాజిబుల్ టీమ్ కూడా అర్ధాంతరంగా షూటింగ్ ఆపేసింది. ఈ సినిమా షూటింగ్ విషయంలో హీరో టామ్ క్రూజ్ చాలా కేర్ తీసుకున్నారు. సెట్‌లో ఎవరైనా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే.. సివియర్ యాక్షన్ తీసుకున్నారు. యూనిట్ మెంబర్స్ మీద టామ్ ఫైర్ అయిన వీడియోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా ఎంటర్ కాకుండా మాత్రం ఆపలేకపోయారు.
యూనిట్‌లో 11 మందికి ఒకేసారి పాజిటివ్ రావటంతో లీడ్ ఆర్టిస్ట్‌లు షూటింగ్‌ను సడన్‌గా ఆపేశారు మేకర్స్. దాదాపు 20 రోజుల బ్రేక్ తరువాత రెగ్యులర్ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్‌లో కొన్ని యాక్సిడెంట్… సీన్స్‌ను షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓ భారీ ట్రైన్ క్రాష్ సీన్‌ను సెట్‌లో రూపొందించేందుకు రెడీ అవుతున్నారట.
మరిన్ని ఇక్కడ చదవండి :