Avatar 2: అవతార్ 2 సందడి అప్పుడే మొదలైంది.. విడుదలకు ముందే రికార్డ్స్ మోత.. ..
అవతార్ 2 రికార్డ్స్ బద్దలుకొడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్స్ ప్రీమియం ఫార్మాట్స్ కోసం దాదాపు 15 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. డిసెంబర్ 16న థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నందున అడ్వాన్స్ సేల్స్
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అవతార్ 2. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గతంలో ప్రభంజనం సృష్టించిన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని అవతార్ ది వే ఆఫ్ వాటర్ టైటిల్‌తో డిసెంబర్ 16న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. మరోసారి అవతార్ 2 రికార్డ్స్ బద్దలుకొడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్స్ ప్రీమియం ఫార్మాట్స్ కోసం దాదాపు 15 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. డిసెంబర్ 16న థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నందున అడ్వాన్స్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా పీవీఆర్ పిక్చర్స్ సీ ఈఓ కమల్ జియాంచందానీ మాట్లాడుతూ.. ” జేమ్స్ కామెరూన్ చిత్రాలు భారతీయ బాక్సాఫీస్‌పై ఎల్లప్పుడూ మాయాజాలం సృష్టించాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్‌పై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్‌లు మాత్రమే మిగతా అన్ని ఫార్మాట్‌లు ఈరోజు ఓపెన్ అయిన అన్ని ఫార్మాట్లలో మరింత బుకింగ్ పెరుగుతాయని ఆశిస్తున్నాము ” అన్నారు.
అలాగే ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా మాట్లాడుతూ.. ” అవతార్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాను చూసేందుకు సినీ ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే INOX ప్రాపర్టీలలోని ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ చాలావరకు సేల్ అయ్యాయి. ఇక ఇప్పుడు 3డీ, 2డీ ఫార్మాట్ బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది ” అని అన్నారు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2009లో విడుదలైంది. ఇందులో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్, లాజ్ అలోన్సో నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.