Anant Ambani: ‘అంబానీ’ అంటే అట్లుంటది మరి.. అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఒక్క షో కోసం రూ.75 కోట్లు
అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. జామ్‌నగర్ వేదికగా జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరగనున్నాయి.

అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. జామ్‌నగర్ వేదికగా జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరగనున్నాయి. ఇక దేశ విదేశాల ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ పాప్ సింగర్ రిహాన్నా స్పెషల్ పర్ఫామెన్స్ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం రిహాన్ని ఇప్పటికే ఇండియా చేరుకుందట. ఆమె సింగింగ్ షో కోసం పెళ్లి వేదిక వద్ద స్పెషల్ సెట్ ను కూడా డిజైన్ చేయించారట. యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్‌ల్యాండ్ పేరుతో రిహాన్నాసింగింట్ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే తన పర్ఫామెన్స్ కోసం రిహాన్ని ఏకంగా సుమారు 9 మిలియన్ డాలర్లు ఛార్జ్ చేస్తోందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.75 కోట్లు అన్నమాట. ఈ వార్త విని అందరూ షాక్ అయ్యారు.
రిహాన్నాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో రిహానా పేరు కూడా ఉంది. ఆమె పాటలు అంటే యువత పడి చస్తారు. ఇప్పుడీ స్టార్ సింగర్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేయనుంది. తన పాటలతో ఆహూతులను అలరించనుంది. ఇందుకోసం బార్బడోస్ నుంచి ఇండియాకు వచ్చారామె. సాధారణంగా ధనవంతుల పెళ్లిళ్లలో ఇలా స్టార్ సెలబ్రిటీలు వినోదం పంచడం మామూలే. ముఖేష్ అంబానీ దేశ విదేశాల్లోని టాప్ సింగర్స్‌ని నేరుగా ఆహ్వానించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక ఒక్కరోజు మ్యూజిక్ కాన్సర్ట్ ఇచ్చినందుకు గాను సింగర్ రిహాన్నాకు 75 కోట్ల రూపాయలు చెల్లించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. రిహానా తీసుకుంటున్న ఈ రెమ్యునరేషన్‌తో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీయొచ్చు.
రిహాన్నా తనతో పాటు ఓ పెద్ద టీమ్‌ని కూడా ఇండియాకు తీసుకొచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వాటితో పాటు ట్రక్కుల లగేజీలు కూడా భారత్‌కు వచ్చాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో రియానా తన లగేజీని తీసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రియానా తన ఇంటి మొత్తాన్ని మడిచి విమానంలో తీసుకొచ్చిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇండియాలో రిహాన్నా..
Great farmer Rihanna has come to India… she has to perform in the wedding of the son of the Ambani whom she was cursing. pic.twitter.com/QK7OGFYHq0
— Baba Banaras™ (@RealBababanaras) February 29, 2024
రిహాన్నా లగేజ్ చూశారా?
With such luggage Rihanna can settle in India for atleast 3.2 years pic.twitter.com/pPbm0fb9cw
— Godman Chikna (@Madan_Chikna) February 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








