AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నారా?.. బంపర్ ఆఫర్ మీకోసం..

Covid 19 Vaccine: కరోనా మహమ్మారి కారణంగా జనాలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. సరదాగా బయట తిరగలేక..

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నారా?.. బంపర్ ఆఫర్ మీకోసం..
Vaccine
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2021 | 12:37 PM

Share

Covid 19 Vaccine: కరోనా మహమ్మారి కారణంగా జనాలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. సరదాగా బయట తిరగలేక.. ఓ సినిమాకు వెళ్లలేక.. ఓ పేరంటానికి వెళ్లలేక.. నిరాశతో ఇంటికే పరిమితం అయిపోతున్నారు. అయితే, కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి దేశంలో వ్యాక్సీనేషన్ ప్రక్రియను ఉధృతం చేయడం.. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్ ఆంక్షల నుంచి ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలకు, రవాణా సహా చాలా వాటికి అనుమతించగా.. తాజాగా సినిమా థియేటర్లను కూడా ఓపెన్ చేసేందుకు అనుమతులు జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్లు ఓపెన్ చేశారు.

ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి థియేటర్ల యాజమాన్యం సైతం ముందుకొచ్చింది. కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రధాన అస్త్రమని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో.. వ్యాక్సీనేషన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా పీవీఆర్ సినిమాస్ సినీ ప్రేక్షకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న వారికి ఫ్రీ మూవీ టికెట్ అందిస్తోంది. కరోనా టీకా తీసుకున్న వ్యక్తులకు పీవీఆర్ థియేటర్‌లో ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించింది. అంతేకాదు.. ఎవరైతే టీకా తీసుకుని రెండు వారాల వ్యవధిలో సినిమా థియేటర్‌కు వస్తారో వారికి పాప్‌ కార్న్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుందని పీవీఆర్ యాజమాన్యం తెలిపింది. టీకా పొందిన వారు రెండు వారాల వ్యవధిలో సమీపంలోని పీవీఆర్ థియేటర్‌లో ఉచితంగా సినిమా చూడొచ్చని, వారికి ఫ్రీ టికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అయితే, టీకా పొందినట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని పీవీఆర్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఆఫర్ ఇవ్వడం ద్వారా వ్యాక్సీనేషన్ ప్రక్రియను మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని పీవీఆర్ థియేటర్స్ యాజమాన్యం భావిస్తోంది.

అయితే, ఈ ఆఫర్‌ ఆగస్టు 12వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలు మినహా పీవీఆర్ థియేటర్లు తెరిచిన అన్ని రాష్ట్రాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని పీవీఆర్ స్పష్టంచేసింది. ఈ ఆఫర్ ఏ భాషలోని సినిమాకైనా వర్తిస్తుందన్నారు. అయితే, మొదటిసారి టికెట్ఉచితంగా ఇస్తుండగా.. రెండవ సారి 150 రూపాయల వరకు తగ్గింపునివ్వనున్నారు. పరిమిత కాలానికి సంబంధించిన ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోవాలంటే.. పీవీఆర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా సినిమా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also read:

Pulichintala: విరిగిన స్థానంలో లాక్ గేట్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. ప్రకాశం బ్యారేజీకి ఫ్లాష్ ఫ్లడ్.. అధికారుల అప్రమత్తం!

ఆ చేప నోట్లో మనిషి ‘పళ్ళు’..అమెరికాలోని జాలరికి లభించిన అరుదైన మత్స్యం-Fish With Human Like Teeth.

Hyderabad: బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!