Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seetimaarr Pre Release Event: ప్రచార వేగాన్ని పెంచిన సీటీమార్‌ యూనిట్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..

Seetimaarr Pre Release Event: గోపీచంద్‌ హీరోగా సంపద్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సీటిమార్‌'. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా గోపీచంద్‌కు జంటగా నటిస్తోంది. స్పోర్ట్స్‌ డ్రామాగా...

Seetimaarr Pre Release Event: ప్రచార వేగాన్ని పెంచిన సీటీమార్‌ యూనిట్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 08, 2021 | 7:31 PM

Seetimaarr Movie: గోపీచంద్‌ హీరోగా సంపద్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా గోపీచంద్‌కు జంటగా నటిస్తోంది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్‌ ఈ సినిమాతో మరోసారి ట్రాక్‌లోకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు. సంపత్‌ నంది కూడా ఈ సినిమాను అంచనాలకు తగ్గట్లుగానే తెరకెక్కిస్తున్నాడు. గోపీచంద్‌, తమన్నాలు ఈ సినిమాలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషిస్తున్నారు.

వీరిద్దరు వేరు వేరు జట్లకు కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడంతో చిత్ర యూనిట్‌ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

వినాయక చవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్‌ 10న విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచార వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. గోపీచంద్‌, సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఇది రెండో చిత్రం కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా గోపీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. సీటీమార్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమాన్ని ఇక్కడ చూడండి..

Also Read: సినీ ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో టికెట్స్ బుకింగ్ కోసం ప్రత్యేక వెబ్ సైట్..!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ను కంగారెత్తిస్తోన్న గేమ్‌.. పోలీసులను ఆశ్రయించిన కండల వీరుడు

బిగ్ బ్రేకింగ్: వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు అనుమతి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..