‘అర్జున్ రెడ్డి’ తండ్రిగా ప్రముఖ దర్శకుడు..?

‘అర్జున్ రెడ్డి’ తండ్రిగా ప్రముఖ దర్శకుడు..?

టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మొదట ఈ రీమేక్‌కు బాల దర్శకత్వం వహించగా(వర్మ టైటిల్‌తో).. కొన్ని కారణాల వలన విడుదల అవ్వకుండా ఆగిపోయింది. దీంతో కొత్త నటీనటులు, దర్శకుడితో(హీరో మినహా) మరోసారి సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసిన గిరీశయ్య ఈ రీమేక్‌కు దర్శకత్వం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 22, 2019 | 2:45 PM

టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మొదట ఈ రీమేక్‌కు బాల దర్శకత్వం వహించగా(వర్మ టైటిల్‌తో).. కొన్ని కారణాల వలన విడుదల అవ్వకుండా ఆగిపోయింది. దీంతో కొత్త నటీనటులు, దర్శకుడితో(హీరో మినహా) మరోసారి సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసిన గిరీశయ్య ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ధృవ్ తండ్రి పాత్రలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించనున్నారట. ఇందులో నటించేందుకు గౌతమ్ మీనన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విక్రమ్‌, గౌతమ్‌ మీనన్ మధ్య సాన్నిహిత్యం ఉండగా.. ఆ సాన్నిహిత్యం నేపథ్యంలోనే ఇందులో నటించేందుకు గౌతమ్ ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటి బనిత సంధు నటిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu