‘మా’ అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 10వ తేదీనే ఎన్నికలు జరిగి విజేతలను ప్రకటించినా..తన పదవీ కాలం ఇంకా ముగియలేదని మాజీ అధ్యక్షుడు శివాజిరాజా అభ్యంతరం తెలపడంతో ఈ రోజు వరకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆగాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు ఉప్పు-నిప్పులాగ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా కూడా ఈరోజు  నరేష్ ప్రమాణస్వీకారానికి శివాజీరాజా […]

'మా' అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణస్వీకారం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2019 | 6:58 PM

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 10వ తేదీనే ఎన్నికలు జరిగి విజేతలను ప్రకటించినా..తన పదవీ కాలం ఇంకా ముగియలేదని మాజీ అధ్యక్షుడు శివాజిరాజా అభ్యంతరం తెలపడంతో ఈ రోజు వరకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆగాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు ఉప్పు-నిప్పులాగ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా కూడా ఈరోజు  నరేష్ ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరుకావడం గమనార్హం.

ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ ‘మా’ ఎప్పటిలాకే పేదకళాకారులను ఆదుకోవాలని…బయటనుంచి భారీగా ఫండ్స్ సేకరించి అసోసియేషన్ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. తన నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమే’ అన్నారు. ‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించినట్లు ఈ సందర్భంగా నరేష్ వెల్లడించారు. ఈ పాటను సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు.

కాగా నరేష్ ప్రమాణ స్వీకారం చేసిన తీరుపై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ హీరో రాజశేఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేశ్‌ మాట్లాడిన ప్రతి మాటలో ‘నేను’ అనే పదం ఉందని.. ఎక్కడా ‘మేము’ అని ఆయన మాట్లాడలేదంటూ రాజశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నరేష్ అన్నీ మాట్లాడేశారు’ అని చెబుతూ రాజశేఖర్‌ మైక్‌ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు.  ఆ తర్వాత నరేష్  మనమందరం కలిసే చేశాం  అంటూ ఆయనకు సర్థి చెప్పే ప్రయత్నం  చేశారు.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..