ఫోర్బ్స్ జాబితా.. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్, త్రివిక్రమ్

2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. 2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 మధ్య ఆయా సెలబ్రిటీలు సంపాదించిన సంపాదనతో పాటు సెలబ్రిటీల ఫేమ్ పరంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇక ఈ లిస్ట్‌లో టాప్ 1లో నిలిచాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. గతేడాది రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ ఏడాది మొదట స్థానం సంపాదించుకోవడం విశేషం. అలాగే రెండు, మూడు […]

ఫోర్బ్స్ జాబితా.. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్, త్రివిక్రమ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 20, 2019 | 1:50 PM

2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. 2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 మధ్య ఆయా సెలబ్రిటీలు సంపాదించిన సంపాదనతో పాటు సెలబ్రిటీల ఫేమ్ పరంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇక ఈ లిస్ట్‌లో టాప్ 1లో నిలిచాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. గతేడాది రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ ఏడాది మొదట స్థానం సంపాదించుకోవడం విశేషం. అలాగే రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ నిలిచారు.

ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్(4), షారూక్ ఖాన్(6), రణ్‌వీర్ సింగ్(7), అలియా భట్(8), దీపికా పదుకొనే(10)లు టాప్‌ 10లో ఉన్నారు. మరోవైపు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్, త్రివిక్రమ్‌లు టాప్ 100లో స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఈ లిస్ట్‌లో లేని ప్రభాస్ ఇప్పుడు 44వ ర్యాంక్‌లో.. గతేడాది 33వ ర్యాంక్‌లో ఉన్న మహేష్ ఇప్పుడు 54వ స్థానంలో నిలిచారు. అయితే మిగిలిన టాప్ హీరోలు ఎవరూ ఈ లిస్ట్‌లో లేకపోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 77వ స్థానంలో నిలవడం విశేషం.

కాగా ఇదే లిస్ట్‌లో అటు కోలీవుడ్, మాలీవుడ్ నుంచి రజనీకాంత్(13), ఏఆర్ రెహమాన్(16), కమల్ హాసన్(56), మోహన్ లాల్(27), విజయ్ స్థానాలను దక్కించుకున్నారు. అలాగే క్రీడారంగం నుంచి ధోని(5), సచిన్(9), రోహిత్ శర్మ(11), పీవీ సింధు(63), సైనా నెహ్వాల్(81), మిథాలీ రాజ్(88) ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్‌లో నిలిచారు. మొత్తానికి ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి ముగ్గురు ఈ లిస్ట్‌లో నిలవడం గర్వించదగ్గ విషయం.