ఆర్ఆర్ఆర్: చెర్రీ విషయంలో మెగా ఫ్యాన్స్ వర్రీ.. ఎందుకంటే..!
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాదు ఇటు కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు […]
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాదు ఇటు కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం షూటింగ్‌ను పూర్తి చేశారు జక్కన్న.
కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఈ మూవీ షూటింగ్‌కు కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ.. తర్వాత చిత్రీకరణ వేగవంతమైంది. ఈ క్రమంలో ఓసారి ఎన్టీఆర్‌పై, మరోసారి చరణ్‌పై, ఆ మధ్యలో ఇద్దరిపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాడు రాజమౌళి. ఇంతవరకు బాగానే ఉంది ఈ మూవీపై ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో నటించే ఏ హీరో.. ఆ మూవీ పూర్తయ్యేవరకు బయట పెద్దగా కనిపించడు. అయితే చెర్రీ మాత్రం విరివిగా ఫ్యాన్స్‌కు కనిపిస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్‌లు లీక్ అవ్వడం తప్ప.. ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఈ మూవీలో అసలు చెర్రీ కారెక్టర్ ఎంత ఉంటుందో అన్న అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు అతడి లుక్ కూడా సాధారణంగా ఉండటంతో.. ఆర్ఆర్ఆర్‌లో చెర్రీ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదా..! అని వారు వర్రీ అవుతున్నారు.
అయితే సినిమా ప్రారంభమైన సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఈ మూవీలో ఇద్దరికి సమాన పాత్ర ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరి అసలు ‘ఆర్ఆర్ఆర్’లో చెర్రీ పాత్ర ఎలా ఉండబోతోంది..? చెర్రీ, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి ఎలా తీర్చిదిద్దాడు..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.