పేరు మార్చుకుంటోన్న ‘జర్నీ’ హీరో.. అంజలి పేరు కలిసేలా..!

‘రాజా రాణి’, ‘జర్నీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు జై. ఇటీవలే 25 చిత్రాలను పూర్తి చేసుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. అయితే కోలీవుడ్‌లో ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ సార్లు వార్తల్లో నిలిస్తుంటాడు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలుమార్లు పోలీసులకు చిక్కాడు ఈ యువ హీరో. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం ఇతగాడి డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా టెంపరరీగా రద్దైంది. […]

పేరు మార్చుకుంటోన్న 'జర్నీ' హీరో.. అంజలి పేరు కలిసేలా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 20, 2019 | 4:11 PM

‘రాజా రాణి’, ‘జర్నీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు జై. ఇటీవలే 25 చిత్రాలను పూర్తి చేసుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. అయితే కోలీవుడ్‌లో ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ సార్లు వార్తల్లో నిలిస్తుంటాడు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలుమార్లు పోలీసులకు చిక్కాడు ఈ యువ హీరో. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం ఇతగాడి డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా టెంపరరీగా రద్దైంది. ఇదిలా ఉంటే తెలుగమ్మాయి అంజలితో జై ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. జర్నీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలుకాగా.. మనస్పర్థల వలన కొద్ది రోజులు విడిపోయారు.

అయితే ఆ తరువాత మళ్లీ వీరిద్దరు కలిసిపోగా.. పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గాసిప్‌లు గుప్పుమన్నాయి. కానీ వాటిని వీరిద్దరు ఖండించారు. ఇదిలా ఉంటే ఇటీవల జై, అంజలి గురించి నిర్మాత నందకుమార్ మాట్లాడుతూ.. అంజలి చాలా మంచిదని, ఆమె కెరీర్లో ఎదగకుండా జై చాలా ప్రయత్నాలు చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలను వారిద్దరు లైట్ తీసుకున్నారు. కాగా ఇటీవల మరోసారి జై, అంజలిల పెళ్లి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో  జై మాట్లాడుతూ.. ఒకవేళ తాను పెళ్లిచేసుకోవాలనుకుంటే అందులో దాచాల్సిన విషయమేమి ఉండదని.. అందరికీ చెప్పి పెళ్లి చేసుకోవడం తనకు చాలా ఆనందమని తెలిపాడు. అయితే ఈ సందర్భంగా అంజలితో ప్రేమ, పెళ్లి విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనర్హం. ఇక ఇదే సందర్భంగా తన పేరును మార్చుకోవాలనుకుంటున్నానని.. అజీస్ జై‌గా పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. మరి ఈ పేరును జై ఎప్పుడు మార్చుకుంటాడు..? అంజలితో జై ప్రేమలో ఉన్నాడా..? వారిద్దరు పెళ్లి చేసుకుంటారా..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కాగా ప్రస్తుతం కోలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్న అంజలి.. తెలుగులో అనుష్క, మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.