AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అఫీషియల్: మహేష్ కోసం మెగాస్టార్.. గెట్‌ రెడీ ఫర్ ‘మెగాసూపర్ఈవెంట్’

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ రాబోతున్నారని.. మెగా సూపర్‌ ఈవెంట్‌ కోసం సిద్ధంగా ఉండండి అని […]

అఫీషియల్: మహేష్ కోసం మెగాస్టార్.. గెట్‌ రెడీ ఫర్ 'మెగాసూపర్ఈవెంట్'
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 20, 2019 | 6:45 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ రాబోతున్నారని.. మెగా సూపర్‌ ఈవెంట్‌ కోసం సిద్ధంగా ఉండండి అని మూవీ యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ”మీరు మెగా ఈవెంట్లను చూసి ఉండొచ్చు. సూపర్ ఈవెంట్లు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాం. సూపర్‌స్టార్ హోస్ట్ చేయబోతున్న ఈవెంట్‌కు మెగాస్టార్ అతిథిగా రాబోతున్నారు. మెగా సూపర్ ఈవెంట్‌కు సిద్ధమవ్వండి” అని సరిలేరు నీకెవ్వరు టీమ్ తెలిపింది. దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ సినిమా ఈవెంట్‌ కోసం చిరంజీవి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇక దీనిపై స్పందించిన మహేష్ బాబు, చిరంజీవికి థ్యాంక్స్‌ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు. అందులో ‘‘సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలన్న ఆ ఆహ్వానానికి మీరు ఒప్పుకున్నందుకు హృదయపూర్వక ధన్యావాదాలు. మా వేడుకల్లో మీరు భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ రాకతో మా సంతోషం రెట్టింపు అవుతుంది. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఓ లాండ్ మార్క్ ఈవెంట్‌ను చేయబోతోంది. మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను సర్’’ అని కామెంట్ పెట్టారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. ఈ మూవీలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా.. ఆయనతో రష్మిక రొమాన్స్ చేసింది. విజయశాాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హరితేజ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస విజయాలను దక్కించుకున్న మహేష్ బాబు.. ఈ మూవీతో హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే