అప్పుడే రౌడీగారికి 48 కోట్ల పారితోషికమా..?

టైటిల్ చూస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తోంది కదా. హీరోల రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. అసలు పారితోషికాల విషయమై ఏ హీరో కూడా పదవి విప్పరు. కానీ ఆ హీరో ఇంత పారితోషికం తీసుకున్నాడని.. లేదా సినిమాలో వాటా పుచ్చుకున్నాడని ఊహాగానాలు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక రూమర్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రౌడీకి టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా […]

అప్పుడే రౌడీగారికి 48 కోట్ల పారితోషికమా..?
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 20, 2019 | 1:26 PM

టైటిల్ చూస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తోంది కదా. హీరోల రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. అసలు పారితోషికాల విషయమై ఏ హీరో కూడా పదవి విప్పరు. కానీ ఆ హీరో ఇంత పారితోషికం తీసుకున్నాడని.. లేదా సినిమాలో వాటా పుచ్చుకున్నాడని ఊహాగానాలు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక రూమర్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

రౌడీకి టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇక తాజాగా అతడికి బీ-టౌన్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని.. అదీ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌ నిర్మిస్తున్నట్లు ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం విజయ్‌కు ఏకంగా 48 కోట్లు ఆఫర్ ఇచ్చారని టాక్. అయితే ఈ ఊహాగానాలు గుప్పుమన్న వెంటనే.. ఇది వట్టి బూటకమని రౌడీ ఫ్యాన్స్ కొట్టిపారేశారు.

బాలీవుడ్‌లో ఇప్పటిదాకా ఖాన్ల త్రయం తప్పితే.. ఇతర ఏ స్టార్ హీరో కూడా 30 కోట్లు మించి రెమ్యునరేషన్  తీసుకోరు. అలాంటిది పరభాషా హీరో అయిన విజయ్‌కు 48 కోట్ల పారితోషికం ఇవ్వడం అతిశయోక్తి తప్ప మరేమీ కాదని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఈ సినిమా టీజర్ వచ్చే నెల 3వ తేదీన విడుదల కానుంది.