AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోర్ ఫన్‌తో వస్తున్న ‘ఎఫ్3’ మూవీలో మరోముగ్గురు అందాలభామలు.. ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్2 ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.

మోర్ ఫన్‌తో వస్తున్న 'ఎఫ్3' మూవీలో మరోముగ్గురు అందాలభామలు.. ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2020 | 5:47 PM

Share

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్2 ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఎఫ్3 టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో మరింత ఫన్ ను జోడించనున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమాషూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతోపాటు మరో హీరో కూడా నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే మొదట మూడో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడని అన్నారు, ఆ తర్వాత మాస్ రాజా రవితేజ పేరు వినిపించింది. ఆతర్వాత సునీల్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు మూడో హీరో మీద అటు దర్శకుడు కాని చిత్రయూనిట్ కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారట. ఎఫ్ 2 లో నటించిన తమన్నా , మెహరీన్ లు ఎఫ్3 లోనూ కంటిన్యూ అవుతున్నారు.. వీరితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారని అంటున్నారు. అందులో పాయల్ రాజ్ పుత్ , రాశీఖన్నా, నటిస్తుండగా రష్మిక మందన  గెస్ట్ రోల్ లో కనిపించనుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు