తండ్రీ కొడుకుల ‘సినిమా’ బంధం…సూపర్‌స్టార్‌తో కలిసి ప్రిన్స్‌ నటించిన చిత్రాలు ఇవే..

తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మహేష్ బాబు చిన్నపుడే పలు చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో నటించారు.

తండ్రీ కొడుకుల 'సినిమా' బంధం...సూపర్‌స్టార్‌తో కలిసి ప్రిన్స్‌ నటించిన చిత్రాలు ఇవే..
Krishna And Mahesh Babu
Follow us

|

Updated on: Nov 15, 2022 | 6:28 PM

సినీ పరిశ్రమలలో నటశేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా కీర్తింపబడ్డారు కృష్ణ.. కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు మహేష్‌బాబు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. ప్రిన్స్‌గా గుర్తింపు సంపాదించుకున్న మహేష్‌బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 10చిత్రాల్లో కలిసి నటించారు. అందులో బాలనటుడిగా 7 సినిమాల్లో కలిసి నటించగా, హీరో అయ్యాక మూడు చిత్రాల్లో నటించారు. మహేష్ బాబు మొదటిసారి బాలనటుడిగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’ చిత్రంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించలేదు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మహేష్ బాబు చిన్నపుడే పలు చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో నటించారు. మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మొత్తంగా పది సినిమాల్లో కలిసి నటించారు. అందులో దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

తండ్రీ కొడుకులు కలిసి నటించిన చిత్రాలు…

1. పోరాటం.. మహేష్ బాబు తొలిసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన చిత్రం ‘పోరాటం’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వీళ్లిద్దరు అన్నాదమ్ములుగా నటించారు.

ఇవి కూడా చదవండి

2. శంఖారావం.. మహేష్ బాబు రెండోసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘శంఖారావం’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో తండ్రీ తనయులుగా నటించడం విశేషం.

3. బజారు రౌడీ.. రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా నటించిన ‘బజారు రౌడీ’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో నటించారు. ఇందులో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్‌గా నటించారు. ఈ సినిమాలో కృష్ణ తన జీవిత పాత్రలో కనిపించడం విశేషం. ఇది వీళ్లిద్దరు కలిసి నటించిన మూడో చిత్రం కావడం విశేషం

4. ముగ్గురు కొడుకులు.. మహేష్ బాబు నాలుగో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో కలిసి నటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా యాక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని కూడా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముళ్లుగా ఆయన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు సోదరులుగా నటించడం విశేషం.

5. గూఢచారి 117.. మహేష్ బాబు ఐదో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన సినిమా గూఢచారి 117. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

6. కొడుకు దిద్దిన కాపురం.. మహేష్ బాబు ఆరో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు మరోసారి తండ్రీ కొడుకులుగా నటించారు.

7. అన్నాతమ్ముడు.. మహేష్ బాబు ఏడో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘అన్నాతమ్ముడు’ సినిమాలో కలిసి నటించాడు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

8. రాజకుమారుడు.. మహేష్ బాబు ఎనిమిదో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘రాజ కుమారుడు’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో కృష్ణ గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. కేవలం ఒకే సన్నివేశంలో మాత్రమే వీళ్లిద్దరు కనిపిస్తారు. అది కూడా విలన్ కలగనే సీన్‌లో వీళ్లిద్దరు కనిపిస్తారు. హీరోగా మహేష్‌బాబుకి ఇది తొలి చిత్రం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది

9. వంశీ.. మహేష్ బాబు తొమ్మిదో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘వంశీ’ సినిమాలో కలిసి యాక్ట్ చేసారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. వంశీ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా కలిసి నటించడం విశేషం. మొత్తంగా తండ్రీ తనయులు కాకుండా కోడలు కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం విశేషం.

10. టక్కరి దొంగ.. మహేష్ బాబు పదో సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ‘టక్కరి దొంగ’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో కృష్ణ సినిమా క్లైమాక్స్‌లో కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.

కృష్ణ, మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత విజయవంతం కాలేదు.ఆ తర్వాత కృష్ణ నటించిన శ్రీశ్రీ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..