నాలుగు ఆస్కార్‌‌లు గెలిచిన ’పారాసైట్‘ విజయ్ మూవీ కాపీనా..!

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఆస్కార్ ప్రధానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో ఉత్తర కొరియన్ చిత్రం పారాసైట్‌ దూసుకుపోయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం, బెస్ట్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకుడు కేటగిరీలలో నాలుగు అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. అయితే ఆస్కార్‌లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు. కేఎస్ రవికుమార్ […]

నాలుగు ఆస్కార్‌‌లు గెలిచిన ’పారాసైట్‘ విజయ్ మూవీ కాపీనా..!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 4:53 PM

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఆస్కార్ ప్రధానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో ఉత్తర కొరియన్ చిత్రం పారాసైట్‌ దూసుకుపోయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం, బెస్ట్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకుడు కేటగిరీలలో నాలుగు అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. అయితే ఆస్కార్‌లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘మిన్సార కన్న’ అనే చిత్రం నుంచి ‘పారాసైట్’ స్టోరీ లైన్ తీసుకున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్‌ ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ‘మిన్సార కన్న’ తెరకెక్కింది. ఇక పారాసైట్‌లో ఓ కుటుంబం మొత్తం బతుకు తెరువు కోసం ఓ ఇంట్లో పనివాళ్లుగా చేరుతారు. అంతా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ.. అక్కడ ఒకరికొకరు తెలియని వారిగా నడుచుకుంటూ ఉంటారు. దీంతో పారాసైట్‌ కథను మిన్సార కన్న నుంచి తీసుకున్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ‘పారాసైట్’, ‘షాప్ లిఫ్టర్’ అనే చిత్రంను కూడా పోలి ఉందని మరికొంతమంది తమ కామెంట్లు వినిపిస్తున్నారు. కాగా విజయ్ చిత్రం మిన్సార కన్న 1999లో విడుదలైంది. ఖుష్బూ, రంభ, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యావరేజ్ రివ్యూలను తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. అయితే పారాసైట్ మాత్రం ఏకంగా నాలుగు అకాడమీ అవార్డులను సాధించడం విశేషం.

Latest Articles
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..
అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాంః అమిత్ షా
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాంః అమిత్ షా