‘భాయ్’ సినిమాలో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా…
Pooja Hegde Next Movie: ‘అల..వైకుంఠపురములో’ హిట్‌తో హీరోయిన్ పూజా హెగ్డేకు ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఓ డియర్’ సినిమాలో నటిస్తున్న ఆమెకు హిందీలో బంపరాఫర్ ఒకటి తగిలింది. ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న‘కబి ఈద్ కబి దివాళి’ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సల్లూభాయ్ సరసన పూజా నటించడం ఇదే తొలిసారిగా.. ఈ అవకాశం నిజంగా ఆమెకు గోల్డెన్ […]
Pooja Hegde Next Movie: ‘అల..వైకుంఠపురములో’ హిట్‌తో హీరోయిన్ పూజా హెగ్డేకు ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఓ డియర్’ సినిమాలో నటిస్తున్న ఆమెకు హిందీలో బంపరాఫర్ ఒకటి తగిలింది. ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న‘కబి ఈద్ కబి దివాళి’ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
సల్లూభాయ్ సరసన పూజా నటించడం ఇదే తొలిసారిగా.. ఈ అవకాశం నిజంగా ఆమెకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇప్పటికే హిందీలో ‘మొహెంజొదారో’ అనే సినిమా చేసి ప్లాప్ అందుకున్న ఆమెకు ఇటీవల విడుదలైన ‘హౌస్ ఫుల్ 4’ కొంత ఊరటను ఇచ్చింది. 2021 ఈద్ కానుకగా విడుదలకానున్న ‘కబి ఈద్ కబి దివాళి’లో పూజ స్మాల్ టౌన్ యువతిగా కనిపించనుంది.