Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: నా జీవితాన్ని నాశనం చేశావంటూ కృతిపై నెటిజన్‌ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ..

పరం సుందరి'.. బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ నటించిన ఈ పాట యూట్యూట్‌లో సృష్టించిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. 'మిమీ' సినిమాలోని ఈ పాటకు సంగీత దిగ్గజం

Kriti Sanon: నా జీవితాన్ని నాశనం చేశావంటూ కృతిపై నెటిజన్‌ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ..
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2021 | 1:19 PM

‘పరం సుందరి’.. బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ నటించిన ఈ పాట యూట్యూట్‌లో సృష్టించిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. ‘మిమీ’ సినిమాలోని ఈ పాటకు సంగీత దిగ్గజం ఏ. ఆర్‌. రెహమాన్‌ బాణీలు కట్టగా స్టార్‌ సింగర్‌ శ్రేయాఘోషల్‌ ఎంతో హృద్యంగా ఆలపించింది. సంగీతాభిమానుల మనసు దోచుకున్న ఈ పాటను ఎంతో మంది నెటిజన్లు రీక్రియేట్‌ చేశారు. స్ఫూప్‌లతో అనుకరించారు. ఈ వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ‘పరం సుందరి’ పాటతో తన జీవితం నాశనమైందంటూ ‘పరంఛాయా’ అనే పేరుగల ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ నేను చిన్నప్పుడు స్కూల్‌లో కూడా ఇంత ఇబ్బంది పడలేదు. నా ఇంటిపేరు, నా పేరును ఆటపట్టించిన వారిపై నాకు కోపం రాలేదు. కానీ కృతి సనన్ నటించిన ‘పరమ సుందరి’ విడుదలైనప్పటి నుంచి నేను ఇప్పటివరకు కనీసం 1000 సార్లు వేధించబడ్డాను. ఎందుకు ఇలా చేశావు కృతి.. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు’ అంటూ రెండు స్మైలీ ఎమోజీలు పెట్టి ట్వీట్‌ చేశాడు. అంతేకాదు ఈ పోస్టుకు కృతిని కూడా ట్యాగ్‌ చేశాడు.

కాగా నెటిజన్‌ చేసిన ఈ సరదా ట్వీట్‌కు బాలీవుడ్ హీరోయిన్‌ కూడా అంతే సరదాగా సమాధానమిచ్చింది. ‘ఊప్స్‌..స్వారీ’ అంటూ నాలుగు ఎమోజీలు పెట్టి ట్విట్టర్‌ యూజర్‌కు రిప్లై పంపింది. కాగా ‘వన్‌: నేనొక్కడినే’, ‘దోచెయ్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కృతి ఆతర్వాత బాలీవుడ్‌కు వెళ్లి తన అదృష్టం పరీక్షించుకుంది. వరుసగా విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మిమీ’లో సరోగసీ మదర్‌గా అద్భుతంగా అభినయించిన ఈ అందాల తార ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్‌’ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు ‘బచ్చన్‌ పాండే’, ‘షెహజాద’, ‘గణ్‌పత్‌’ తదితర సినిమాల్లో నటిస్తోంది.

Also Read:

Salman Khan: కత్రినాపెళ్లికి సల్మాన్‌ హాజరవుతున్నాడా?.. సోదరి అర్పిత ఏం చెబుతోందంటే..

Keerthy Suresh: ఇలాంటి చీరకట్టులో కీర్తి సురేష్ ఎప్పుడైనా చూసారా..? నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ అదరగొడుతున్న ఫోటోస్..

Kajal Aggarwal: ఎర్ర కలువ పూవులా మెరిసిపోతున్న చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..