AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: కత్రినాపెళ్లికి సల్మాన్‌ హాజరవుతున్నాడా?.. సోదరి అర్పిత ఏం చెబుతోందంటే..

త కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోన్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ త్వరలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ ఓ విలాసవంతమైన

Salman Khan:  కత్రినాపెళ్లికి సల్మాన్‌ హాజరవుతున్నాడా?.. సోదరి అర్పిత ఏం చెబుతోందంటే..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 12:22 PM

Share

గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోన్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ త్వరలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో డిసెంబరు 9న వీరి వివాహం జరగనుందని బాలీవుడ్‌ జనాలు చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం కత్రినా- విక్కీల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇక ప్రి వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 7న మెహందీ, 8న సంగీత్‌ వేడుకలు జరగనున్నాయట. కాగా వివాహ వేడుక కోసం పెళ్లికి ముందు భారీగా అతిథుల జాబితాను తయారుచేసినా, ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఆహ్వానితుల సంఖ్యను భారీగా తగ్గించారట. ఈ మేరకు కత్రినా-విక్కీ కుటుంబ సభ్యులు వెడ్డింగ్‌ ప్లానర్స్‌తో చర్చలు కూడా జరిపారట.

కాగా కత్రినాను బాలీవుడ్‌కు పరిచయం చేసిన సల్మాన్‌తో ఆమె ప్రేమలో ఉందంటూ గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పెళ్లికి సల్మాన్‌ను కూడా ఆహ్వానించిందా? లేదా? అన్న విషయాలు అభిమానుల మెదళ్లను తొలిచివేస్తున్నాయి. ఈ క్రమంలో సల్మాన్‌ కుటుంబానికి కూడా ఆహ్వానం వెళ్లిందని, వారంతా కత్రినా పెళ్లికి హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా సల్మాన్‌ సోదరి అర్పిత ఈ విషయంపై స్పందించింది. కత్రినా- విక్కీల పెళ్లికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేసింది. ‘ కత్రినా- విక్కీలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే వారి పెళ్లికి సంబంధించి మాకెలాంటి ఇన్విటేషన్‌ అందలేదు. మేం ఈ వివాహానికి హాజరవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సల్లూభాయ్‌ మరొక సోదరి అల్వీరాఖాన్‌ కూడా ఇదే చెప్పడం గమనార్హం. కాగా విడిపోయాక ఎన్నో ఫంక్షన్లు, కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు కత్రినా, సల్మాన్‌. సినిమాల్లో కూడా నటించారు. ‘టైగర్‌’ సిరీస్‌, ‘భారత్‌’ సినిమాల్లో వీరి జంట హిందీ సినిమా ప్రియులను అమితంగా ఆకట్టుకుంది.

Also Read:

Keerthy Suresh: ఇలాంటి చీరకట్టులో కీర్తి సురేష్ ఎప్పుడైనా చూసారా..? నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ అదరగొడుతున్న ఫోటోస్..

Tamannaah Bhatia: దేవకన్య లాంటి డ్రస్ లో తమన్నా మెరుపులు.. ఎట్రాక్ట్ చేస్తున్న ఈ ఫొటోస్‌పై మీరు ఓ లుక్కేయండి..

Kajal Aggarwal: ఎర్ర కలువ పూవులా మెరిసిపోతున్న చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..