కరోనా వైరస్ దీవెనలతోనే సినిమా పూర్తి చేశాం.. అందుకే ‘కరోనా’కు రుణపడి ఉంటామంటున్న ఫేమస్ డైరెక్టర్..
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ బిజీ అయిపోయారు. తాజాగా ఆయన ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కరోనా సినిమా..
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ బిజీ అయిపోయారు. తాజాగా ఆయన ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కరోనా సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా రాం గోపాల్ వర్మ మాట్లాడుతూ.. కరోనా సమయంలో మిగతా ఫిల్మ్ మేకర్స్ అంతా ఇంట్లో ఉండి వంటలు చేస్తూ, మొక్కలకి నీళ్లు పోస్తు టైమ్ పాస్ చెస్తే ,తాము మాత్రం సినిమాలు తీశామని తెలిపారు. కరోనా వైరస్ దీవెనలు తమకు ఉన్నాయని, అందుకే ఎవరు కరోనా వైరస్ భారీన పడకుండా కరోనా వైరస్ సినిమాను తీయగలిగామని, కరోనాకు కచ్చితంగా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్ల ప్రారంభం తర్వాత వస్తున్న తొలిసినిమా కరోనా అన్నారు. ఈ చిత్రంలో వంశీ చాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగస్త్య మంజు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కరోనా సమయంలోనూ తనను నమ్మి సినిమా చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే లాక్‌డౌన్‌లో కొన్ని పెద్ద సినిమాలు కూడా నిర్మించారు వర్మ. అందులో కొన్ని కోర్టు వివాదాలతో పెండింగ్‌లతో ఉండగా మరికొన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. కరోనా సమయంలో అందరూ ఇంట్లో ఉండి సరదాగా గడిపితే వర్మ మాత్రం సినిమాలు తీస్తూ బిజీగా గడిపారు. ఏది ఏమైనా వర్మ అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది.