Evelyn Sharma: అమ్మగా ప్రమోషన్‌ పొందిన సాహో సుందరి.. తల్లి పాత్ర పోషించే టైమొచ్చిందంటూ పోస్ట్‌..

ప్రభాస్‌ హీరోగా నటించిన 'సాహో' సినిమాలో జెన్నిఫర్‌గా మెప్పించిన ఎవ్లీన్‌ శర్మ అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఈ ఏడాది మేలో

Evelyn Sharma: అమ్మగా ప్రమోషన్‌ పొందిన సాహో సుందరి.. తల్లి పాత్ర పోషించే టైమొచ్చిందంటూ పోస్ట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2021 | 7:17 AM

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాలో జెన్నిఫర్‌గా మెప్పించిన ఎవ్లీన్‌ శర్మ అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఈ ఏడాది మేలో డాక్టర్‌ తుషాన్‌ భిండీతో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ‘ నా జీవితంలో ముఖ్యమైన పాత్ర (తల్లిగా)ను పోషించే సమయం ఆసన్నమైంది’ అంటూ తన గారాల పట్టిని ప్రపంచానికి పరిచయం చేసింది. తన బిడ్డకు అవభిండీ అనే పేరు పెట్టినట్లు పోస్ట్‌లో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా నీల్‌ నీతేశ్‌ దేశ్‌ముఖ్‌, సొనాల్‌ చౌహాన్‌, యాస్మిన్‌ కరాచీవాలా వంటి ప్రముఖులు ఈ అందాల తారకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జర్మనీకి చెందిన ఎవ్లీన్‌ కెరీర్‌ మొదట్లో కొన్ని హాలీవుడ్‌ సినిమాలు చేసింది. 2012లో ‘ ఫ్రం సిడ్నీ విత్‌ లవ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రణ్‌బీర్‌ కపూర్‌, దీపిక జంటగా నటించిన ‘యే జవాని హై దీవాని’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఇషాక్‌’, ‘యారియాన్‌’, ‘మై తేరా హీరో’, ‘గద్దర్‌’,చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు హిందీ ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రంతో టాలీవుడ్‌ సినీ ప్రియులను కూడా పలకరించిందీ అందాల తార. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్‌ తుషాన్‌ భిండీతో ప్రేమలో పడింది ఎవ్లీన్‌. 2019 అక్టోబర్‌లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది మేలో బ్రిస్బేన్‌ వేదికగా పెళ్లిపీటలెక్కారు. తుషాన్‌ బిండీ ఆస్ట్రేలియాలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

Also Read:

4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సొట్టబుగ్గల సుందరి.. కశ్మీర్‌లో షూటింగ్‌..

Priya Prakash Varrier: కైపెక్కించే కళ్లతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న అందాల ప్రియా..

Anasuya Bharadwaj: చీర కట్టుతో ఫాన్స్ మనసులను దోచుకుంటున్న అను లేటెస్ట్ ఫొటోస్..