పెళ్ళైన మహిళతో అక్రమ సంబంధం… రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయా!

ఒకప్పుడు బాలీవుడ్‌లో ముద్దుల సీన్‌లకు యమ ఫేమస్ అంటే టక్కున చెప్పే పేరు ఇమ్రాన్ హష్మీ. అయితే తాజాగా ఇమ్రాన్ ఓ సంచలన విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. గతంలో తాను ఒక పెళ్ళైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా ఇమ్రాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా దాన్ని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తను నటించిన మర్డర్ చిత్రంలో సన్నివేశం తన జీవితంలో కూడా జరగడం అస్సలు ఊహించలేనని చెప్పాడు. […]

  • Updated On - 9:04 pm, Thu, 18 July 19
పెళ్ళైన మహిళతో అక్రమ సంబంధం... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయా!


ఒకప్పుడు బాలీవుడ్‌లో ముద్దుల సీన్‌లకు యమ ఫేమస్ అంటే టక్కున చెప్పే పేరు ఇమ్రాన్ హష్మీ. అయితే తాజాగా ఇమ్రాన్ ఓ సంచలన విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. గతంలో తాను ఒక పెళ్ళైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా ఇమ్రాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా దాన్ని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

తను నటించిన మర్డర్ చిత్రంలో సన్నివేశం తన జీవితంలో కూడా జరగడం అస్సలు ఊహించలేనని చెప్పాడు. అయితే అది కాస్తా జరిగిందని.. ఇక ఆ విషయంలో తాను ఇప్పటికి గిల్టీగానే ఫీల్ అవుతున్నానని అన్నాడు. అసలైతే పెళ్ళైన విషయం ఆ అమ్మాయి తన దగ్గర దాచి పెట్టిందని పేర్కొన్నాడు. అనుకోకుండా ఆమెతో ఉన్న సమయంలో ఆమె భర్త చూశాడు. అప్పుడు పెద్ద గొడవ జరిగింది. జీవితంలో దాన్ని తాను తలుచుకున్న ప్రతిసారి తన మీద తనకే అసహ్యం వేస్తోందని తెలిపాడు. ఇది ఇలా ఉండగా తన జీవితంలో జరిగిన తప్పును సెలబ్రిటీ స్టేటస్‌లో ఉండి ఇమ్రాన్ హష్మీ ఇలా బహిర్గతం చేయడంతో పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.