నాని ‘శ్యామ్ సింగ రాయ్’.. మరో హీరోయిన్‌కి ఛాన్స్.. ఆ ఇద్దరిలో నాచురల్ స్టార్ ఓటు ఎవరికి..!
రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి ఖరారు అయ్యారు
Nani Shyam Singha Roy: రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి ఖరారు అయ్యారు. ఇక కథానుగుణంగా ఇందులో మరో హీరోయిన్‌కి ఛాన్స్ ఉందట. ఒక చిన్న కెమెరా అప్పియరెన్స్ ఇందులో ఉండనుందట. ఆ పాత్రకు గానూ ఇప్పుడు అదితీ రావు హైదారీ, నివేథా థామస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని నాని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం. (Bigg Boss 4: ఒంటరిగా కూర్చొని ఏడ్చిన అఖిల్.. ఓదార్చిన అరియానా, అవినాష్, సొహైల్)
కాగా వీరిద్దరితోనూ నాని గతంలో నటించారు. నివేథా థామస్‌తో జంటిల్‌మ్యాన్, నిన్ను కోరిలో నటించగా.. ‘వి’లో అదితీతో జత కట్టారు. మరి ఈ ఇద్దరిలో ఇప్పుడు నాని ఎవరో ఒకరిని సెలక్ట్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని.. టక్ జగదీష్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌లో ఉండగా.. దీని తరువాత శ్యామ్ సింగ రాయ్‌లో నటించనున్నారు. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’లో నటించనున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. (Bigg Boss 4: ఇంటి నియమం ఉల్లంఘించావంటూ అభిజిత్‌కి దెయ్యం జలజ శిక్ష.. తలకిందులుగా వేలాడి..!)