Bigg Boss 4: ఒంటరిగా కూర్చొని ఏడ్చిన అఖిల్.. ఓదార్చిన అరియానా, అవినాష్, సొహైల్
బిగ్‌బాస్‌లో చాలా రోజుల తరువాత అఖిల్, మోనాల్ మనసు విప్పి మాట్లాడుకున్నారు. గేమ్ గేమ్‌లా ఆడుదామని మోనాల్ చెప్పగా.. నువ్వు ఎప్పటి నుంచో అదేగా చేస్తున్నావు అని అఖిల్ అన్నాడు.
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో చాలా రోజుల తరువాత అఖిల్, మోనాల్ మనసు విప్పి మాట్లాడుకున్నారు. గేమ్ గేమ్‌లా ఆడుదామని మోనాల్ చెప్పగా.. నువ్వు ఎప్పటి నుంచో అదేగా చేస్తున్నావు అని అఖిల్ అన్నాడు. ఇక అఖిల్ దగ్గర ప్రామిస్ తీసుకున్న మోనాల్.. సొహైల్ గురించి కొన్ని విషయాలు బయటపెట్ఇంది. సొహైల్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని, ఎవరితో ఎలా మాట్లాడితో మంచి పేరు వస్తుందో అలా మాట్లాడుతాడు అని చెప్పింది. అయితే ఆ విషయాలను అఖిల్ లైట్‌గా తీసుకున్నాడు. వాడు గేమ్ ఎలాగైనా ఆడని, కానీ నాతో మంచిగా ఉంటున్నాడు. నాకు వాడితో మంచి రిలేషన్ ఉంది. మా ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు వస్తే డైరెక్ట్‌గా వెళ్లి అడిగే చనువు ఉంది అని చెప్పుకొచ్చాడు.
దీని తరువాత అఖిల్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించాడు. ఏమైందో.. ఎందుకో చెప్పలేదు కానీ.. ఎలిమినేషనల్ భయంతో ఏడుస్తున్నట్లుగా అనిపించింది. ఇక అరియానా, అవినాష్, సొహైల్‌లు వచ్చి అఖిల్‌ని ఓదార్చారు.