Eesha Rebba: డైరెక్టర్‌తో పెళ్లిపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఈషా రెబ్బా
తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి గత కొన్ని రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ ను ఆమె పెళ్లి చేసుకోనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తుండడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి.

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కాబోతుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ లు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా షూటింగులో వీరు ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కబురు వినిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు తగ్గట్టుగానే ఈషా, తరుణ్ భాస్కర్ లు తరచూ జంటగానే కనిపిస్తున్నారు. ఆ మధ్యన తిరుమలకు కూడా కలిసే వెళ్లొచ్చారు. దీంతో ఇషా, తరుణ్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారేమోనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఈషా రెబ్బా స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది.
‘ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగేవారికి.. ఈషా ఒక వైరల్ మీమ్ వీడియోతో రిప్లై ఇచ్చింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంగ్లిష్ స్పీచ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించింది. అందులో ‘ ఏ ఏ పనులు, ఏ ఏ సమయాల్లో జరగాలో.. ఆయా పనులు ఆయా సమయాల్లో కచ్చితంగా జరిగి తీరుతాయి’ అనే డైలాగ్‌తో తన పెళ్లి గురించి మాట్లాడే వారికి రిప్లై ఇచ్చింది. తన పెళ్లి గురించి అంతా కాలమే నిర్ణయిస్తుందంటూ ఈషా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈషా రెబ్బా షేర్ చేసిన వీడియో ఇదిగో..
View this post on Instagram
కాగా ఓం శాంతి ఓం సినిమా ఓ మలయాళం హిట్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్స్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి.
ఓం శాంతి ఓం సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




