ఆ విషయంలో దుల్కర్ నన్ను చాలా కన్విన్స్ చేశాడు: నిత్యా మీనన్

విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఓ వైపు సినిమాల్లో దూసుకుపోతున్న నిత్యా మీనన్.. ఇటీవలే వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రీత్‌ 2: ఇన్‌ టు ద షాడోస్‌లో అభిషేక్‌తో కలిసి నిత్యా మీనన్ నటించగా..

  • Tv9 Telugu
  • Publish Date - 8:06 pm, Thu, 9 July 20
ఆ విషయంలో దుల్కర్ నన్ను చాలా కన్విన్స్ చేశాడు: నిత్యా మీనన్

విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఓ వైపు సినిమాల్లో దూసుకుపోతున్న నిత్యా మీనన్.. ఇటీవలే వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రీత్‌ 2: ఇన్‌ టు ద షాడోస్‌లో అభిషేక్‌తో కలిసి నిత్యా మీనన్ నటించగా.. ఈ సిరీస్ ఈ నెల‌ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్న నిత్యా, పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తనను చాలా కన్విన్స్ చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.

దుల్కర్, నిత్యా మీనన్ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోమని దుల్కర్ తనను చాలా సార్లు కన్విన్స్ చేశాడని ఆమె తెలిపారు. అంతేకాదు పెళ్లి చేసుకుంటే జీవితంలో వచ్చే మార్పులను కూడా దుల్కర్ తనతో చెప్పినట్లు నిత్యా పేర్కొన్నారు.

”నిజానికి నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ ఈ విషయంలో దుల్కర్ చెప్పిన విషయాల వలన నా మైండ్‌ కాస్త మారింది” అని నిత్యా వెల్లడించారు.  ఇక లెజండరీ దర్శకుడు మణిరత్నంతో తాను క్లోజ్‌గా ఉంటానని నటిగా ఎదిగేందుకు ఆయన చాలా సాయం చేశారని నిత్యా చెప్పుకొచ్చారు. కాగా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. త్వరలో దర్శకత్వం చేసేందుకు రెడీ అవుతున్నారు నిత్యా.