సినిమాకు కరోనా బీమా…దేశంలోనే ఫ‌స్ట్ టైమ్…

నేచుర‌ల్ డిజాస్ట‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు, నటీనటులు అనారోగ్యానికి గురైన‌ప్పుడు.. అనుకోని న‌ష్టం వాటిల్లితే ఆ మొత్తాన్ని భర్తీ చేసేందుకు ప్రొడ్యూస‌ర్స్ బీమా చేసుకోవడం కామ‌న్.

సినిమాకు కరోనా బీమా...దేశంలోనే ఫ‌స్ట్ టైమ్...
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 09, 2020 | 7:37 PM

నేచుర‌ల్ డిజాస్ట‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు, నటీనటులు అనారోగ్యానికి గురైన‌ప్పుడు.. అనుకోని న‌ష్టం వాటిల్లితే ఆ మొత్తాన్ని భర్తీ చేసేందుకు ప్రొడ్యూస‌ర్స్ బీమా చేసుకోవడం కామ‌న్. కానీ ఇప్పుడు కోవిడ్-19 బారి నుంచి తమ సినిమాను రక్షించుకునేందుకు బాలీవుడ్​ ప్రొడ్యూస‌ర్ అతుల్ కస్బేకర్ ప్రయత్నాలు మొద‌లెట్టారు. ప్రజంట్ న్యాయ నిపుణుడితో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ లెక్క‌లు కుదిరితే కొవిడ్-19 కోసం బీమా చేయించుకున్న ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీ ఇదే అవుతుంది. ‘లూప్ లపేటా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

అనుకున్న‌ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మేలో.. ముంబై, గోవాలో ఈ చిత్ర షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ కోవిడ్-19 సంక్షోభం కారణంగా దేశం మొత్తం లాక్​డౌన్ విధించడం వల్ల అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌లేదు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 70 శాతం కంప్లీట్ చేశారు. ఇటీవలే ప్రభుత్వాలు షూటింగుల‌కు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వర్షకాలం తర్వాత చిత్రీక‌ర‌ణ పునఃప్రారంభించాల‌ని ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అన్ని కుదిరితే దీపావళి తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.