“దర్శకుడు కావలెను” అంటోన్న నాగార్జున..!
హిందీలో సూపర్ హిట్టయిన 'రైడ్'ను తెలుగులో రీమేక్ చేయడానికి అగ్ర హీరో నాగార్జున ఎప్పట్నుంచో ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి పలువురు దర్శకులను అప్రోచ్ అయ్యారు.
హిందీలో సూపర్ హిట్టయిన ‘రైడ్’ను తెలుగులో రీమేక్ చేయడానికి అగ్ర హీరో నాగార్జున ఎప్పట్నుంచో ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి పలువురు దర్శకులను అప్రోచ్ అయ్యారు. మరి ఆ చిత్రాన్ని మలిచే బాధ్యతని ఎవరికి అప్పచెబుతారనేది ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.
ప్రజంట్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా ఫైనల్ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నెక్ట్స్ చేయాల్సిన సినిమాలపై నాగ్ ఫోకస్ పెట్టారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఈ అక్కినేని హీరో ఓ సినిమాకు సైన్ చేశారని టాక్ నడుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ మూవీ రూపొందుతుందని సమాచారం. ప్రవీణ్ సత్తారు సినిమా తర్వాతే ‘రైడ్’ రీమేక్ పట్టాలెక్కనుంది. కాగా హీంది ‘రైడ్’ లో అజయ్ దేవగణ్, సురభ్ శుక్లా, ఇలియానా ప్రధాన పాత్రల్లో వచ్చారు. 80వ దశకంలో జరిగిన ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.