రాశి ఖన్నా టార్చర్‌ చూపించిందన్న ‘నగ్నం’ హీరోయిన్‌

బబ్లీ గర్ల్‌ రాశి ఖన్నాపై రామ్ గోపాల్ వర్మ 'నగ్నం' మూవీ హీరోయిన్‌ శ్రీ రాపాక అలియాస్ స్వీటీ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్‌గా పరిచయం అవ్వకముందు శ్రీ గతంలో పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు

రాశి ఖన్నా టార్చర్‌ చూపించిందన్న 'నగ్నం' హీరోయిన్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2020 | 5:48 PM

బబ్లీ గర్ల్‌ రాశి ఖన్నాపై రామ్ గోపాల్ వర్మ ‘నగ్నం’ మూవీ హీరోయిన్‌ శ్రీ రాపాక అలియాస్ స్వీటీ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్‌గా పరిచయం అవ్వకముందు శ్రీ గతంలో పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా సుప్రీం సినిమా సమయంలో తనకు రాశి ఖన్నా టార్చర్‌ చూపించిందని ఆమె అన్నారు.

”సుప్రీం సినిమా కోసం నేను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశా. ఓ రోజు 3 గంటల సమయంలో రాశి ఖన్నా నాకు ఫోన్ చేసి చీర కట్టేందుకు కట్టాలని రమ్మంది. నేను అక్కడికి వెళ్లే సరికి ఆమె చుట్టూ 150 మంది ఉన్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఎవరి సహాయం తీసుకోనైనా ఆమె చీర కట్టుకోవచ్చు. నన్ను గంటల పాటు రాశి ఖన్నా వెయిట్ చేయించేది. దాంతో నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది. వాళ్లు ఓ యాటిట్యూడ్‌లో ఉంటారు. రాశి తనతో ఎలా ప్రవర్తిస్తుందన్న విషయం దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా తెలుసు. రాజు సుందరం మాస్టర్‌తో కూడా నేను పనిచేశా. ఒకసారి సెట్‌లో ఆయన నన్ను చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు. రాశి నాకు చేసిన టార్చర్‌ని రాజు సుందరం మాస్టర్‌కి కూడా చెప్పా. రాశి ఖన్నా విషయంలో నేను చాలా సార్లు బాధ పడ్డా. నిఫ్ట్‌(నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో నేను కాలేజీ టాపర్‌ని. అలాంటిది నన్ను ఇలా చేస్తుందేంటని చాలా బాధపడ్డా. హీరోయిన్లకు తెలుగు వారంటూ చిన్న చూపు” అని శ్రీ చెప్పుకొచ్చింది.