గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌.. బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్ అంటూ..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ బ్యాన‌ర్స్‌లో గీతా ఆర్ట్స్ కూడా ఒక‌టి. ఇప్పుడు ఆ పేరే కేటుగాళ్ల‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ పేరును వాడుకుంటూ అమ్మాయిల‌కు వ‌ల వేశారు కొంద‌రు కేటుగాళ్లు. ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప‌క్క‌నే హీరోయిన్ ఛాన్స్ అంటూ అమ్మాయిల‌ను..

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌.. బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్ అంటూ..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2020 | 8:35 AM

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ బ్యాన‌ర్స్‌లో గీతా ఆర్ట్స్ కూడా ఒక‌టి. ఇప్పుడు ఆ పేరే కేటుగాళ్ల‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ పేరును వాడుకుంటూ అమ్మాయిల‌కు వ‌ల వేశారు కొంద‌రు కేటుగాళ్లు. ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప‌క్క‌నే హీరోయిన్ ఛాన్స్ అంటూ అమ్మాయిల‌ను ట్రాప్ చేశారు. గీతా ఆర్ట్స్‌లో డిజైన‌ర్‌, మేక‌ప్ మెన్ అని చెప్పుకుంటూ, చాటింగ్ చేస్తూ అమ్మాయిల‌ను బుట్ట‌లో వేసుకున్నారు. కాగా ఈ విష‌యం కాస్తా గీతా ఆర్ట్స్ దృష్టి కి రావ‌డంతో.. సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌మిళ్ సినిమాల‌లో హీరో బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఇప్పిస్తామంటూ అమ్మాయిల‌కు వ‌ల వేస్తున్న‌ట్టు తెలిసింద‌ని గీతా ఆర్ట్స్ ఫిర్యాదులో పేర్కొంది. త‌మ బ్యాన‌ర్ పేరు చెప్పి అమ్మాయిల‌ను మోసం చేస్తున్న కేటుగాళ్ల‌పై యాక్ష‌న్ తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు గీతా ఆర్ట్స్ మేనేజ‌ర్ స‌త్య‌. ఈ కేసుపై స్పందించిన పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read More:

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మాజీ మంత్రి రామ‌స్వామి మృతి..