భారీగా శానిటైజర్ బాటిల్స్ సీజ్.. రీజన్ ఏంటంటే..?

మధ్యప్రదేశ్‌లో భారీగా శానిటైజర్‌ బాటిల్స్‌ను సీజ్ చేశారు డీజీజీఐ అధికారులు. భోపాల్‌లోని రైసన్‌ ప్రాంతంలో సెహత్గంజ్‌ గ్రామంలో ఓ కంపెనీ బ్రాండెడ్‌ శానిటైజర్‌ బాటిల్స్‌ను తయారు చేస్తోంది. అయితే ఈ కంపెనీ..

భారీగా శానిటైజర్ బాటిల్స్ సీజ్.. రీజన్ ఏంటంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2020 | 8:24 PM

మధ్యప్రదేశ్‌లో భారీగా శానిటైజర్‌ బాటిల్స్‌ను సీజ్ చేశారు డీజీజీఐ అధికారులు. భోపాల్‌లోని రైసన్‌ ప్రాంతంలో సెహత్గంజ్‌ గ్రామంలో ఓ కంపెనీ బ్రాండెడ్‌ శానిటైజర్‌ బాటిల్స్‌ను తయారు చేస్తోంది. అయితే ఈ కంపెనీ జీఎస్టీ బిల్లులు చెల్లించకుండా అక్రమంగా శానిటైజర్‌ బాటిల్స్‌ను మార్కెట్లో అమ్మినట్లు గుర్తించారు. దాదాపు రూ.7.97 కోట్ల విలువైన శానిటైజర్‌ బాటిల్స్‌ను అక్రమంగా అమ్మి.. జీఎస్టీ ఎగవేసిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కంపెనీలో తనిఖీలు చేయగా.. రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటిని అధికారులు సీజ్ చేశారు. కాగా, గత రెండు వారాలుగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కంపెనీకి చెందిన ఇద్దరు డైరక్టర్లను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.