AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుకుమార్‌తో విభేదాలు వచ్చాయి: మహేశ్ బాబు

హైదరాబాద్: దర్శకుడు సుకుమార్‌తో తనకు క్రియేటీవ్ అంశాల విషయంలో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని మహేశ్ బాబు చెప్పారు. నేనొక్కడినే మూవీ తర్వాత సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందని భావిస్తోన్న సమయంలో మహేశ్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సుకుమార్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టుకు మహేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గొప్ప దర్శకుడిగా తాను సుకుమార్‌ను ఎప్పుడూ గౌరవిస్తాను, 1 నేనొక్కడినే ఒక అద్భుతమైన సినిమా, […]

సుకుమార్‌తో విభేదాలు వచ్చాయి: మహేశ్ బాబు
Vijay K
|

Updated on: Mar 05, 2019 | 10:16 AM

Share

హైదరాబాద్: దర్శకుడు సుకుమార్‌తో తనకు క్రియేటీవ్ అంశాల విషయంలో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని మహేశ్ బాబు చెప్పారు. నేనొక్కడినే మూవీ తర్వాత సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందని భావిస్తోన్న సమయంలో మహేశ్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే సుకుమార్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టుకు మహేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గొప్ప దర్శకుడిగా తాను సుకుమార్‌ను ఎప్పుడూ గౌరవిస్తాను, 1 నేనొక్కడినే ఒక అద్భుతమైన సినిమా, ఆ సినిమాకు పని చేసినప్పుడు ప్రతి సందర్భాన్ని ఆశ్వాదించానని మహేశ్ అన్నారు.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఆర్య-3 తీస్తున్నట్టుగా మహాశివరాత్రి సందర్భంగా ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్‌కు మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. భరత్ అనే నేను మూవీతో మహేశ్, రంగస్థలం మూవీతో సుకుమార్ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే.