‘బలగం’ కొమురయ్య చిన్న కొడుకు చక్రవాకం సీరియల్‌లో నటించాడని తెలుసా.? మనోడిది మాములు ట్యాలెంట్ కాదండోయ్.
బలగం సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు కలిసిపోతున్నాయంటేనే బలగానికి జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారో చెప్పొచ్చు. ఈ సినిమా విజయంలో దర్శకుడు వేణు పాత్ర ఎంత ఉందో నటీనటులది కూడా అంతే ఉందని చెప్పడంలో...
బలగం సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు కలిసిపోతున్నాయంటేనే బలగానికి జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారో చెప్పొచ్చు. ఈ సినిమా విజయంలో దర్శకుడు వేణు పాత్ర ఎంత ఉందో నటీనటులది కూడా అంతే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రంలోని ప్రతీ ఒక్క పాత్ర అత్యంత సహజంగా నటించి మెప్పించారు. అందుకే బలగం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటోంది.
బలగం మూవీలో మర్చిపోలేని పాత్రల్లో కొమురయ్య చిన్న కొడుకు మొగిలయ్య పాత్ర ఒకటి. సినిమా చివర్లో మొయిలయ్య పాత్ర నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇంతకీ ఈ పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో తెలుసా.? ఇతని పేరు మధుసూధన్ అలియాస్ మైమ్ మధు. తెలంగాణలోని హన్మకొండకు చెందిన మైమ్ మధు సినీ జీవితం చక్రవాకం సీరియల్‌తో మొదలైంది. చిన్న తనం నుంచి నటన మీద ఆసక్తి ఉన్న మధు ఆకాశవాణి అనే సినిమాలో తన అద్భుత నటనతో మెప్పించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా మొగలిరేకులు, శ్రావణసమీరాలు వంటి సీరియల్స్‌లోని లీడ్ రోల్స్‌కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణసమీరాలు సీరియల్‌కి గానూ.. నంది అవార్డ్ అందుకున్నారు.
మైమ్ యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ముధుసూధన్ మైమ్ యాక్టింగ్‌లో పరిణితి సాధిస్తూ మైమ్ మధుగా మారారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన మైమ్ మధు.. హ్యూమన్ రీసెర్చ్ నుంచి స్కాలర్ షిప్ అందుకున్నారు. అనంతరం ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించి.. దేశ విదేశాల్లో వర్క్ షాప్‌లు ఇచ్చి.. పలువరు నటులకు మైమ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆకాశవాణి, గాలి సంపత్, చోర్ బజార్ వంటి చిత్రాల్లో నటించారు మధు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..