Dasara Movie: దసరా దర్శకుడికి మరో బిగ్ ఆఫర్.. ఆ యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్న శ్రీకాంత్ ? ..
విడుదలైన ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. దర్శకుడు తన ఎగ్జిక్యూషన్ టేకింగ్ పై ప్రశంసలు అందుకున్నాడు. దసరా బ్లాక్ బస్టర్ ఎఫెక్టుతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ దర్శకుడికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా అద్భుతమైన టేకింగ్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. హిందీలో ఈ సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ సౌత్ లో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అటు కలెక్షన్స్ లోనూ ఏమాత్రం తగ్గెదేలే అన్నట్లుగా దూసుకుపోతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. దర్శకుడు తన ఎగ్జిక్యూషన్ టేకింగ్ పై ప్రశంసలు అందుకున్నాడు. దసరా బ్లాక్ బస్టర్ ఎఫెక్టుతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ దర్శకుడికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా శ్రీకాంత్ ఓదెలకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కినేని అఖిల్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ చేయనున్నారట. అయితే వీరిద్దరి కాంబో పై ఒప్పందం కాలేదని.. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ చిత్రం రిలీజ్ అ్యాక.. కాస్త గ్యాప్ తీసుకుని శ్రీకాంత్ ఓదెలను కలుస్తారని.. ఆ తర్వాతే వీరి ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఇక దసరా చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నాని.. కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రం హవా నడుస్తోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సాయి కుమార్, సముద్రఖని,దీక్షిత్ శెట్టి కీలకపాత్రలలో నటించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.