AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Varsha: చేతి నిండా టీవీ షోస్, ఈవెంట్స్.. జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వర్ష ఒకరు. అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించిన ఆమె తన అందం, అభినయంతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యింది. ఇక జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్‏తో కలిసి వర్ష చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి.

Jabardasth Varsha: చేతి నిండా టీవీ షోస్, ఈవెంట్స్.. జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Jabardasth Varsha
Basha Shek
|

Updated on: Jun 11, 2026 | 5:29 PM

Share

జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. ఈ కామెడీ షోలో ఇమ్మాన్యుయేల్ తో ఆమె చేసిన కామెడీ స్కిట్స్, లవ్ ట్రాక్ లు బుల్లితెర ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. కాగా జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది వర్షం. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ తో బుల్లితెరపై బాగానే ఫేమస్ అయ్యింది. ఇక జబర్దస్త్ కు వచ్చిన తర్వాత వర్ష రేంజ్, క్రేజ్ అమాంతం పెరిగిపోయాయి. పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షోలతో పాటు హోస్ట్ గానూ రాణిస్తోంది వర్ష. ఓ ప్రముఖ ఛానెల్ లో సెలబ్రిటీ లతో కలిసి టాక్ షో రన్ చేస్తోంది. వీటితో పాటు బయట ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటుందీ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. మరి చేతినిండా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోన్న వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? అని నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

కాగా కెరీర్ ప్రారంభంలో తొలి ప్రేమ, ప్రేమ ఎంత మధురం, మట్టి గాజులు, అత్తారింటికి దారేది వంటి ఫేమస్ సీరియల్స్ లో నటించింది వర్ష. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు పలు టీవీ షోల్లో సందడి చేయడంతో పాటు యాంకరింగ్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని నివేదికల ప్రకారం వర్ష నెలకు దాదాపు పది లక్షలకు పైగా సంపాదిస్తుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో అబద్ధముందో తెలియాదు కానీ వర్ష రెమ్యునరేషన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోస్..

కాగా మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నూ నటిస్తానంటోంది వర్ష. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసిందీ అందాల తార. అలాగనీ హీరోయిన్ పాత్రలు చేయాలన్న ఆశ లేదని, ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, నాగ చైతన్య సినిమాల్లో పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానని వర్ష చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? అసలు ఊహించలేరు
జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? అసలు ఊహించలేరు
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు