ఆ ఆర్నెళ్లు ‘గజిని’ని అయ్యా.. ఏం జరిగిందో కూడా గుర్తులేదు
లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దిశా పటానీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయింది. అయితే ఒకానొక సమయంలో ఆమె తలకు గాయం అవ్వడంతో గతాన్ని మర్చిపోయిందట. ఒక ఆర్నెళ్లు తాను గజినిలాగానే ఉండిపోయానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఓ సారి జిమ్నాస్టిక్స్ చేస్తోన్న సమయంలో తల నేలకు తగలడంతో బలమైన గాయమైంది. దాంతో ఆర్నెళ్ల పాటు ఙ్ఞాపకశక్తిని కోల్పోయా. ఆ ఆరు నెలల్లో ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. ట్రీట్‌మెంట్‌తో మళ్లీ మామూలు మనిషినయ్యా. […]

లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దిశా పటానీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయింది. అయితే ఒకానొక సమయంలో ఆమె తలకు గాయం అవ్వడంతో గతాన్ని మర్చిపోయిందట. ఒక ఆర్నెళ్లు తాను గజినిలాగానే ఉండిపోయానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఓ సారి జిమ్నాస్టిక్స్ చేస్తోన్న సమయంలో తల నేలకు తగలడంతో బలమైన గాయమైంది. దాంతో ఆర్నెళ్ల పాటు ఙ్ఞాపకశక్తిని కోల్పోయా. ఆ ఆరు నెలల్లో ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. ట్రీట్‌మెంట్‌తో మళ్లీ మామూలు మనిషినయ్యా. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక ఉండాలి. ఇవాళ నేను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమేనని దిశా తెలిపింది. అయితే ఈ ఏడాది భారత్‌తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దిశా.. ప్రస్తుతం మలంగ్ అనే చిత్రంలో నటిస్తోంది.



