Ranga Marthanda: మరోసారి రూమర్లకు చెక్ పెట్టిన కృష్ణవంశీ.. ఎట్టకేలకు రంగమార్తాండ షూటింగ్ మళ్లీ మొదలైందంటూ..
Ranga Marthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'రంగమార్తాండ'. ఏ ముహుర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ అస్సలు ముందుకు సాగడం లేదు. ఈ సినిమా షూటింగ్..

Ranga Marthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రంగమార్తాండ’. ఏ ముహుర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ అస్సలు ముందుకు సాగడం లేదు. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి కాలేదు. పలు రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గతంలో ఈ సినిమా నుంచి నిర్మాత తప్పుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే చిత్ర యూనిట్ వీటిని ఖండిస్తూ షూటింగ్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు మళ్లీ మాములు స్థితికి వచ్చినప్పటికీ.. రంగమార్తాండ షూటింగ్ మాత్రం ప్రారంభంకాలేదు. దీంతో మరోసారి ఈ సినిమా ఆగిపోయిందంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.
సరైన విజయాన్ని అందుకోక చాలా రోజులు అవుతోన్న తరుణంలో ఈ సినిమాను కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మళ్లీ పుకార్లు వస్తోన్న నేపథ్యంలో కృష్ణవంశీ ఓ ట్వీట్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
సినిమా షూటింగ్ ఎట్టకేలకు మళ్లీ మొదలైంది అంటూ షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూస్తుంటే శివాత్మికకు సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
కృష్ణ వంశీ ట్వీట్..
Finalllllyyyy …. Rangamarthanda shoot resumed … maestro s eletrifying number being shot on shivathmika and rahulsipligunz and models …. Energies…. pic.twitter.com/ulyLmraONb
— Krishna Vamsi (@director_kv) September 27, 2021
Drishyam 2: నారప్ప బాటలోనే దృశ్యం 2 సినిమా.. ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్ ?..
Shilpa Shetty: ఆ ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన శిల్పాశెట్టి.. ఆ వీడియోలో నిజమెంత?
