పవన్ మూవీపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన హరీష్

గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో బిజీగా గడిపిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సినిమాలను ఒప్పుకున్న పవన్.. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పక్కా ప్రణాళికను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలన్నింటికి సంబంధించిన ఇప్పటికే అధికారిక ప్రకటనలు రాగా.. అందులో దర్శకనిర్మాతల గురించి మాత్రమే స్పష్టత వచ్చింది. ఇక మిగిలిన నటీనటులు, సాంకేతిక విభాగం, కథ […]

పవన్ మూవీపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన హరీష్

గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో బిజీగా గడిపిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సినిమాలను ఒప్పుకున్న పవన్.. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పక్కా ప్రణాళికను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలన్నింటికి సంబంధించిన ఇప్పటికే అధికారిక ప్రకటనలు రాగా.. అందులో దర్శకనిర్మాతల గురించి మాత్రమే స్పష్టత వచ్చింది. ఇక మిగిలిన నటీనటులు, సాంకేతిక విభాగం, కథ ఇలా పలు విషయాలపై అధికారిక ప్రకటన రాలేదు(పింక్ రీమేక్‌కు మాత్రం సంగీత దర్శకుడుగా థమన్‌ కన్ఫర్మ్ అయ్యాడు). దీంతో వాటికి సంబంధించిన పలు రూమర్లు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో పవన్-హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్‌ కోసం పెద్దగా రిస్క్ చేయాలని భావిస్తోన్న హరీష్, పవన్ ఇమేజ్‌కు సరిపోయే ఓ రీమేక్‌ స్టోరీని ఎంచుకున్నట్లు టాక్ వినిపించింది. ఇది కాస్త దర్శకుడి వద్దకు చేరడంతో.. దానిపై హరీష్ శంకర్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తనపై ఏదైనా వార్త రాసేముందు తనను సంప్రదించవచ్చు కదా అని హరీష్ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు. కాగా ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Click on your DTH Provider to Add TV9 Telugu