సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు!

Telangana government good news for Telugu film industry: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సినీనటులు చిరంజీవి, నాగార్జునలతో సమావేశమయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశంలో.. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై వీరు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించింది. అవి: 1. శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు 2. 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్‌కు […]

సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు!

Telangana government good news for Telugu film industry: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సినీనటులు చిరంజీవి, నాగార్జునలతో సమావేశమయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశంలో.. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై వీరు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించింది. అవి:

1. శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు 2. 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్‌కు నైపుణ్యం పెంపుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు 3. చిత్రపురి కాలనీలో హాస్పిటల్, పాఠశాల నిర్మాణం 4. అలాగే చిత్రపురి కాలనీలో సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయింపు 5. కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయింపు 6. Fdc తరపున సినీ, టీవీ కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ 7. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు అందే విధంగా సవరణ 8. ఈఎస్‌ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్‌లు అమలు 9. సినీ అవార్డుల ప్రధానం తదితర అంశాలపై చర్చ 10. ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు

కాగా పైన తెలిపిన వివరాలిపై 2వ వారంలో మరోసారి సినీ ప్రముఖులు, సంబంధిత అధికారులతో సమావేశం కావాలని.. చిరు, నాగ్‌లు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించారు.

Published On - 9:18 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu