తెలంగాణః డేంజరస్‌గా మారిన తొమ్మిది నగరాలు.. అక్కడ గాలి పీలిస్తే అంతే!

Air Pollution Reached To Dangerous Levels: వాయు కాలుష్యం.. ఇప్పుడు మెట్రోపాలిటిన్ సిటీస్ అన్నింటికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు అదే కోవలోకి తెలంగాణలోని తొమ్మిది నగరాలు సైతం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇటీవల గ్రీన్‌పీస్ ఇండియా నిర్వహించిన ఓ […]

తెలంగాణః డేంజరస్‌గా మారిన తొమ్మిది నగరాలు.. అక్కడ గాలి పీలిస్తే అంతే!

Air Pollution Reached To Dangerous Levels: వాయు కాలుష్యం.. ఇప్పుడు మెట్రోపాలిటిన్ సిటీస్ అన్నింటికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు అదే కోవలోకి తెలంగాణలోని తొమ్మిది నగరాలు సైతం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా ఇటీవల గ్రీన్‌పీస్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వాయు కాలుష్యంపై పలు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని తొమ్మిది నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ నిర్దేశించిన స్థాయి కంటే అధికంగా ఉందని ఆ నివేదిక చెబుతోంది. వాయు కాలుష్యం ఈ స్థాయి తీవ్రతకు చేరుకోవడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.  ఇక దీని వల్ల ఈ నగరాల్లో నివసించే వారికి ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.

దేశవ్యాప్తంగా సుమారు 287 నగరాల్లో వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుకుందన్న దానిపై ఆ సంస్థ సర్వే చేపట్టగా.. మొత్తం 231 నగరాలలో వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఇక అందులో తెలంగాణ నుంచి తొమ్మిది నగరాలు.. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు నగరాల్లో కాలుష్యం లెవెల్స్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. కాగా, ఈ లిస్టులో మిజోరాం చివరి స్థానంలో ఉంది.

తెలంగాణలో కొత్తూరు, హైదరాబాద్, రామగుండం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, పఠాన్‌చేరు, ఆదిలాబాద్‌లలో ఎక్కువగా వాయు కాలుష్యం ఉండగా.. నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు కొంచెం ఫర్వాలేదని నివేదిక చెబుతోంది. ఇక అటు ఏపీలో రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, వైజాగ్, కర్నూలు, అనంతపురంలలో దీని తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

Published On - 9:34 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu