AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajay Bhupathi: అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు.. కారణమేంటో తెలుసా.?

Ajay Bhupathi: 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం..

Ajay Bhupathi: అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు.. కారణమేంటో తెలుసా.?
Ajay Bhupati
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 29, 2021 | 6:25 AM

Share

Ajay Bhupathi: ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే తొలి చిత్రం తర్వాత చాలా రోజులు గ్యాప్‌ తీసుకున్న అజయ్‌.. తన రెండో చిత్రంగా మహా సముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్‌, శర్వానంద్‌ వంటి బడా హీరోలతో పాటు పలువురు సీనియర్‌ నటులతో తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బలం లేని కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమా థియేటర్లకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

ఇదే విషయమై ఓ అభిమాని ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘మహా సముద్రం సినిమాను ఏంటి అన్న అలా తీశావు. చాలా ఊహించుకున్నాం’ అని రాసుకొచ్చాడా అభిమాని. దీంతో ఈ ట్వీట్‌పై ఏకంగా దర్శకుడు అజయ్‌ భూపతి నేరుగా స్పందించారు. ఎలాంటి భేషజాలకు పోకుండా తన తప్పును ఒప్పుకున్నాడు. అభిమాని అడిగిన ప్రశ్నకు జెన్యూన్‌గా బదులిచ్చిన అజయ్‌.. ‘మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. మరోసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తా’ అంటూ ట్వీట్‌ చేశాడు. మరి రెండో సినిమాతో పరాజయం మూటగట్టుకున్న అజయ్‌ తన తర్వాతి చిత్రాన్ని ఎలా ప్లాన్‌ చేస్తాడో చూడాలి.

Also Read: Dharani Portal: కీలక మైలురాయిని దాటిన ధరణి పోర్టల్.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

TRS Plenary Flexis: ఫ్లెక్సీలు కట్టారుగా జరిమానాలు కట్టండి.. ఆ పార్టీ నాయకులకు భారీ ఫైన్లు..

T20 World Cup 2021: అదిరిపోయే సిక్స్ కొట్టిన జాసన్ రాయ్.. వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ..