AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: పూజా కార్యక్రమాలతో క్లాసులు ప్రారంభించిన ధనుష్‌.. పట్టాలెక్కిన ‘సార్‌’ సినిమా షూటింగ్‌..

ఇప్పటివరకు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్‌ స్టార్‌ ఇప్పుడు నేరుగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'సార్‌' అనే సినిమాతో నేరుగా తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Dhanush: పూజా కార్యక్రమాలతో క్లాసులు ప్రారంభించిన ధనుష్‌.. పట్టాలెక్కిన 'సార్‌' సినిమా షూటింగ్‌..
Sir Movie
Basha Shek
|

Updated on: Jan 03, 2022 | 2:23 PM

Share

ఇప్పటివరకు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్‌ స్టార్‌ ఇప్పుడు నేరుగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘సార్‌’ అనే సినిమాతో నేరుగా తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. కేరళ బ్యూటీ సంయుక్తా మేనన్‌ ధనుష్‌తో రొమాన్స్‌ చేయనుంది. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ లాంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి ‘వాత్తి’ అనే టైటిల్ ఖాయం చేశారు దర్శక నిర్మాతలు. కాగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం (జనవరి3) ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది చిత్రబృందం.

జూనియర్‌ లెక్చరర్‌గా ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా, నిర్మాత చినబాబు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో ధనుష్‌ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే టైటిల్ లోగో లో పెన్‌ కనిపిస్తుంది. ఇక పోస్టర్‌లో భారీ బ్లాక్‌బోర్డ్‌తో పాటు తరగతిలో విద్యార్థులు దానివైపు చూస్తున్నట్టు, అలాగే ధనుష్ పాఠాలు చెబుతున్నట్టు చూపించారు. కాగా ‘సార్‌’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 5 నుంచి ప్రారంభం కాబోతోంది. కాగా ఈ సినిమాకు ముందే శేఖర్‌ కమ్ములతో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనుందని సమాచారం.

Also Read:

Hyderabad: ఫ్లైఓవర్లు/బ్రిడ్జిలపై రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే..ఈ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిందే..

Sampoornesh and Jogi Ramesh: సంపూర్ణేశ్‌బాబుతో కలిసి జుంబా డ్యాన్స్‌ చేసిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌.. వైరలవుతోన్న వీడియో..

Mukku Avinash: బుల్లితెర కమెడియన్ అవినాశ్‌ ఇంటిని చూశారా? .. థీమ్‌ పోస్టర్స్‌ తో గదులను ఎంత బాగా అలంకరించారో..