Social Media: నెట్టింట్లో హల్‏చల్ చేస్తున్న వార్నర్ వీడియో.. ఈసారి సూపర్ స్టార్‏నే దించేశాడుగా..

ఆస్ట్రేలియా బ్యాట్స్‏మెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియేటివిటిని బయటపెట్టాడు. ఇటీవల తెలుగు సినిమాల్లోని పాటలకు తన కుటుంబంతో కలిసి

Social Media: నెట్టింట్లో హల్‏చల్ చేస్తున్న వార్నర్ వీడియో.. ఈసారి సూపర్ స్టార్‏నే దించేశాడుగా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2021 | 11:29 AM

ఆస్ట్రేలియా బ్యాట్స్‏మెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియేటివిటిని బయటపెట్టాడు. ఇటీవల తెలుగు సినిమాల్లోని పాటలకు తన కుటుంబంతో కలిసి స్టేప్పులేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. 2020 ఏడాదిని ఇలా ముగిస్తున్నా ఓ వీడియో షేర్ చేశాడు. అందులో మహర్షి సినిమాలోని మహేశ్ బాబు ఫేస్‏కు బదులుగా తన ఫేస్‏ను మార్చేశాడు.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ దర్భార్ సినిమాను ఎంచుకున్నాడు వార్నర్. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్ ఫేస్‏కు బదులుగా తన ఫేస్ జతచేసి ఓ వీడియోని షేర్ చేశాడు. ‘అభిమానుల కోరిక మేరకు ఈ వీడియోను షేర్ చేశాను. అందరికి న్యూఇయర్ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్‏లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పటి నుంచి వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దీంతో తెలుగు సినిమాల్లోని పాటలకు తన హావభావాలతో స్పేప్పులేసి టిక్‏టాక్ వీడియోలు చేశాడు.

Also Read:

సూపర్ స్టార్ మహేశ్ సినిమాలో వార్నర్ ?.. 2020కి ముగింపు చెప్పిన క్రికెటర్.. నెట్టింట్లో వీడియో వైరల్..