AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ చిరంజీవితో అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో.. ‘లూసిఫర్’ రిమేక్‏లో కీలకపాత్ర ?

ఇటీవల కాలంలో పలు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు తెలుగు యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాక్

మెగాస్టార్ చిరంజీవితో అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో.. 'లూసిఫర్' రిమేక్‏లో కీలకపాత్ర ?
Rajitha Chanti
|

Updated on: Jan 02, 2021 | 10:54 AM

Share

ఇటీవల కాలంలో పలు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు తెలుగు యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా ఈ యంగ్ హీరో సూపర్ ఛాన్స్ కొట్టేశాడట.

చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఖైదీ 150 సినిమాతో తన సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన సైరా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్‏లో ఆచార్య సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ మరో మూడు చిత్రాల్లో నటించనున్నట్లుగా టాక్. వీటిలో మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మలయాళంలో ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించగా.. తెలుగులో చిరంజీవి నటించనుండగా.. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ పాత్ర కోసం స్వయంగా చిరంజీవే సత్యదేవ్ పేరును సూచించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇటీవల సత్యదేవ్, మెగాస్టార్ చిరంజీవిని కలవడం. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. లూసిఫర్ రీమేక్‏లో నిజంగానే ఈ యంగ్ హీరో నటిస్తున్నాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Follow Us
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?