Mohan Babu: నాయీ బ్రాహ్మణ సంఘం నేతల నిరసన.. మోహన్ బాబు దిష్టిబొమ్మ దహనానికి యత్నం..
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohanbabu)పై నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. తన వద్ద ఎన్నో ఏళ్లుగా హెయిర్ స్టయిలిస్ట్ గా పని చేస్తున్న నాగ శ్రీనును కులం పేరుతో దూషించడమే దీనికి కారణం
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu)పై నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. తన వద్ద ఎన్నో ఏళ్లుగా హెయిర్ స్టయిలిస్ట్ గా పని చేస్తున్న నాగ శ్రీనును కులం పేరుతో దూషించారన్న ఆరోపణలే ఈ నిరసనలకు కారణం. ఈక్రమంలో నాగశ్రీను కుటుంబానికి మంచు ఫ్యామిలీ వెంటనే క్షమాపణలు చెప్పాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు డిమాండ్లు చేస్తున్నారు. తాజాగా నాగశ్రీను విషయంలో మోహన్ బాబు వైఖరిని నిరసిస్తూ ఒంగోలులో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. మోహన్‌బాబు దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మోహన్ బాబు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా పదేళ్లుగా మంచు మోహన్ బాబు, విష్ణుల దగ్గర హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్న నాగశ్రీనుపై వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో చోరీ కేసు అక్రమంగా బనాయించారని నాయీబ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపించారు. ఇటీవల విడుదలైన సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై నాగశ్రీను అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడన్న కారణంగా మోహన్ బాబు ఇంట్లో పనివాళ్ల ముందు మోకాళ్లపై నాగశ్రీనును కూర్చోబెట్టి నానా దుర్భాషలాడారని వారు చెబుతున్నారు. అంతే కాకుండా రూ.5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రిని చోరీ చేశాడని అక్రమ కేసులు బనాయించారన్నారు. నాగశ్రీనుపై వేధింపులు తట్టుకోలేక అతని తల్లి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైందన్నారు. నాగశ్రీనుపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడిన మోహన్‌బాబు, మంచు విష్ణులపై కేసులు పెట్టాలని నాయీబ్రాహ్మణ సంఘం నేతలు డిమాండ్ చేశారు.
Mirchi price: పండింది మిర్చి కాదు.. బంగారం.. క్వింటా ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Nag Ashwin : ప్రభాస్ సినిమాకోసం ఆనంద్ మహేంద్ర సాయం కోరిన నాగ్ అశ్విన్..