AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: బిగ్‌ బీకి బర్త్‌డే విషెస్‌ చెప్పిన మెగాస్టార్‌.. అమితాబ్‌తో దిగిన అరుదైన ఫోటోను షేర్‌ చేస్తూ..

Chiranjeevi: భారతదేశం గర్వించతగ్గ నటుల్లో అమితాబ్‌ బచ్చన్‌ ఒకరు. తన అసమాన నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 46 ఏళ్లు గడుస్తోన్నా..

Chiranjeevi: బిగ్‌ బీకి బర్త్‌డే విషెస్‌ చెప్పిన మెగాస్టార్‌.. అమితాబ్‌తో దిగిన అరుదైన ఫోటోను షేర్‌ చేస్తూ..
Chiranjeevi
Narender Vaitla
| Edited By: |

Updated on: Oct 11, 2021 | 7:28 PM

Share

Chiranjeevi: భారతదేశం గర్వించతగ్గ నటుల్లో అమితాబ్‌ బచ్చన్‌ ఒకరు. తన అసమాన నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 46 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇతే పాత్రలకు చేస్తానని గిరి గీసుకోకుండా మారుతోన్న కాలానికి, వయసుకు అనుగుణంగా రకరకలా పాత్రల పోషిస్తూ ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై నిజమైన మెగాస్టార్‌గా వెలుగు వెలుగుతున్నారు. 79ఏళ్ల వయసులోనూ అమితాబ్‌ నటన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

బిగ్‌ బీ అమితాబ్‌ పుట్టిన రోజు నేడు (సోమవారం). ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అమితాబ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కూడా అమితాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అమితాబ్‌తో కలిసి దిగిన ఓ అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్న చిరు.. ‘మా పెద్దన్న. ఎప్పటికీ నా గురువు. ఒకే ఒక్కరు అమిత్‌ జీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో సంతోషం వెల్లువెరియాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే అమితాబ్‌, చిరంజీవి కలిసి ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Also Read: Union Bank: యూనియన్ బ్యాంకర్ సర్క్యూలర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు.. దెబ్బకు దిగొచ్చిన యాజమాన్యం..

తల్లి స్నానం చేస్తుంటే కూతురు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో షేర్ చేసింది.. కట్ చేస్తే..

Amazon Prime: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో మ‌ళ్లీ మంత్లీ స‌బ్‌స్కిప్ష‌న్ ఆప్ష‌న్‌.. ధరల వివరాలు