AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Bank: యూనియన్ బ్యాంకర్ సర్క్యూలర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు.. దెబ్బకు దిగొచ్చిన యాజమాన్యం..

Union Bank: భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో కీలకమైన యూనియన్ బ్యాంక్ పెద్ద తప్పే చేసింది. అయితే, టెన్షన్ పడకండి.. అది ఆర్థికపరమైనది కాదులేండి.

Union Bank: యూనియన్ బ్యాంకర్ సర్క్యూలర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు.. దెబ్బకు దిగొచ్చిన యాజమాన్యం..
Union Bank
Shiva Prajapati
|

Updated on: Oct 11, 2021 | 1:48 PM

Share

Union Bank: భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో కీలకమైన యూనియన్ బ్యాంక్ పెద్ద తప్పే చేసింది. అయితే, టెన్షన్ పడకండి.. అది ఆర్థికపరమైనది కాదులేండి. నవరాత్రి వేడుకల సందర్భంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులు డ్రెస్ కోడ్ అనుసరించాలంటూ సర్క్యూలర్ జారీ చేసింది. ఆ సర్క్యూలర్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దాంతో బ్యాంక్ యాజమాన్యం తాజాగా వెనక్కి తగ్గింది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. బ్యాంక్ ఉద్యోగులందరూ తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకల్లో భాగంగా డ్రెస్ కోడ్‌ను పాటించాలంటూ సర్క్యూలర్ జారీ చేసింది. ఆ సర్క్యూలర్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ. 200 జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది. ‘‘నవరాత్రి పర్వదినం సందర్భంగా బ్యాంకులో పని చేసే సిబ్బంది అంతా తొమ్మిది రోజుల పాటు కలర్ డ్రెస్‌ కోడ్‌ను పాటించాలి. ఒక్కో రోజు ఒక్కో రంగు డ్రెస్ ధరించి రావాలి. ఎల్లో, గ్రీన్, గ్రే, ఆరెంజ్, వైట్, రెడ్, రాయల్ బ్లూ, పింక్, పర్పుల్. ఇలా తొమ్మిది రంగుల డ్రెస్‌లు, తొమ్మిది రోజులు ధరించాలి. రోజుకో కలర్ డ్రెస్‌లో ఉద్యోగులను రోజూవారీగా గ్రూప్ ఫోటో తీయడం జరుగుతుంది.’’ అని ఆ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.

ఈ సర్క్యూలర్‌పై ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిథులు తీవ్రంగా మండిపడ్డారు. ‘నవరాత్రి మతపరమైన పండుగ. సెక్యూలర్ ఫాబ్రిక్ పట్ల గౌరవం కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇలాంటి విధానాలు భావ్యం కాదు. ఏదైనా ఉంటే అనధికారికంగా జరుపుకోవాలి. ఇలా అధికారికంగా కాదు. ఏ పండుగనైనా స్వచ్ఛందంగా చేసుకోవాలి తప్ప నిర్బంధంగా కాదు. ఇలాంటి విధానాలు, ఆలోచనలు ఏమాత్రం సరికాదు. బ్యాంకు 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిణామాలు జరుగలేదు.’’ అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. దీంతో అలర్ట్ అయిన యూనియన్ బ్యాంక్ యాజమాన్యం. తాము జారీ చేసిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకున్నారు.

Also read:

RCB Vs KKR in IPL 2021: ఎవరు ఇంటికి…ఎవరు సెమీస్ కి… ఈ ఉత్కంఠ సమరంపై మరిన్ని వివరాలు..(వీడియో)

Skincare: చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..! కిచెన్‌లో దొరికే ఈ 5 చక్కటి పరిష్కారం..

Samantha: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్