Skincare: చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..! కిచెన్‌లో దొరికే ఈ 5 చక్కటి పరిష్కారం..

Skincare: చర్మ సంరక్షణ కోసం ప్రతిరోజు ఎన్నో బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతుంటాం కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలిక ప్రయోజనం

Skincare: చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..! కిచెన్‌లో దొరికే ఈ 5 చక్కటి పరిష్కారం..
Skincare
Follow us

|

Updated on: Oct 11, 2021 | 1:38 PM

Skincare: చర్మ సంరక్షణ కోసం ప్రతిరోజు ఎన్నో బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతుంటాం కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలిక ప్రయోజనం మాత్రమే. అందుకే చాలామంది హోమ్‌ రెమిడీస్‌ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే వీటివల్ల సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు ధర కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రోజు చర్మ సంరక్షణ కోసం ఇంట్లో దొరికే ఐదు ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.

1. అవకాడో అవకాడో ఒక ఆరోగ్యమైన పండు. ఇది సహజసిద్దమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మెరుపును అందించడంలో తోడ్పడుతుంది. అవోకాడో చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఇది వృద్ధాప్యం, ముడతలు, మొటిమలు, డెడ్ స్కిన్ వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది.

2. కాలే చర్మ సంరక్షణకు కాలే (కాలే క్యాబేజీ కుటుంబం నుండి వచ్చిన ఆకుపచ్చ ఆకు కూర) ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు సి, ఇ, కె పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్ తగ్గించి సహజమైన మెరుపును తీసుకువస్తాయి.

3. వెన్న మీరు పొడిబారిన చర్మంతో బాధపడుతుంటే వెన్నని ఉపయోగించండి. ఇందులో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఎ, ఇ ఉంటాయి. ఇది కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని బిగుతుగా చేయడంలో తోడ్పడుతుంది. చర్మాన్ని కండిషనింగ్, టోనింగ్, మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది.

4. చియా విత్తనాలు చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి. వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తాయి.

5. మౌంటైన్ పెప్పర్ బెర్రీ మౌంటైన్ పెప్పర్ బెర్రీలో విటమిన్ సి, ఈ ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంతో పాటు మంట, ఎరుపును తగ్గిస్తుంది. చర్మ కణాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మౌంటైన్ పెప్పర్ బెర్రీ డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Samantha: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..