చిరు- కొరటాల ప్రాజెక్ట్ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అవేంటంటే.. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఉండనుందట. అంతేకాదు జూన్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడట. దానికి సంబంధించి చిరు డేట్లు కూడా ఫిక్స్ అయినట్లు సన్నిహిత […]

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
అవేంటంటే.. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఉండనుందట. అంతేకాదు జూన్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడట. దానికి సంబంధించి చిరు డేట్లు కూడా ఫిక్స్ అయినట్లు సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ‘సైరా’ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం జపాన్ ట్రిప్‌కు వెళ్లాడు. ఈ ట్రిప్‌ను పూర్తి చేసుకొని సైరా షూటింగ్‌లో పాల్గొననున్న చిరు ఆ మూవీని పూర్తి చేసి.. ఎలాంటి గ్యాప్ లేకుండా కొరటాలతో సెట్స్ మీదకు వెళ్లనున్నాడట. ఇక ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే.